AP Politics: రసవత్తరంగా రాజకీయం.. ఇదంతా ఆయన కుర్చీకోసమేనా..
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:23 AM
AP Politics: నిడదవోలులో రాజకీయం మారిపోయింది. రాజకీయం రసవత్తరంగా మారింది. చైర్మన్ కుర్చీలాటలో వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. వైసీపీ రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో కొత్త రంగు పులుముకుంది.
AP Politics: నిడదవోలులో రాజకీయం మారిపోయింది. రాజకీయం రసవత్తరంగా మారింది. చైర్మన్ కుర్చీలాటలో వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. వైసీపీ రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో కొత్త రంగు పులుముకుంది. నేడో రేపో మునిసిపల్ కౌన్సిల్ చేజారిపోయే పరిస్థితి వచ్చింది. నిడదవోలు మునిసిపాలిటీలో మొత్తం 27 మంది సభ్యులతో నిన్నటి వరకూ వైసీపీ బలంగా ఉంది. అయితే గత శుక్రవారం మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ సహా పది మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడిపై అసంతృప్తితోనే తామంతా రాజీనామా చేస్తున్నామని బహిరంగంగానే కొందరు వ్యాఖ్యానించారు. 48 గంటలు గడిచిందో లేదో పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లలో అరుగల్లు వెంకటేశ్వర్లు, ఆకుల ముకుందారావు.. ఆదివారం మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు సమక్షంలో తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో రాజీనామా చేసిన కౌన్సిలర్ల సంఖ్య 8కి చేరింది.
ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రాజకీయం మళ్లీ మారింది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు కౌన్సిలర్లు మంత్రి దుర్గేష్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, ఎం.డి. షాజీరాబేగం, ముంగంటి మాణిక్యమాల, ఉసురుమర్తి జాన్ బాబు, చిలకల శారదా దేవి, సైదు చంద్రశేఖర్, మద్దిపాటి నాగశ్రీ మానుపాటి లక్ష్మీ జనసేనలో చేరారు. మిగిలిన కౌన్సిలర్లు వైసీపీ చేజారి పోయే పరిస్థితి ఉంది. అదే జరిగితే నిడదవోలు మునిసిపాలిటీ జనసేన వశమవుతుంది.
ఎందుకిలా..
నిడదవోలు మునిసిపాలిటీ డైర్మన్ కుర్చీపై ఆదినారాయణ, కామిశెట్టి సత్తిబాబు మధ్య అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు సూచన మేరకు రెండున్నరేళ్ల ఒప్పందం ఉంది. ఆ లెక్కన ఇప్పటికే ఆదినారాయణ పదవీకాలం ముగిసింది. అయితే ఒప్పందాన్ని తోసిపుచ్చి.. ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నారు. మరోవైపు కామిశెట్టి సత్యనారాయణ తనకు పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. అది తప్పించుకునేందుకే ఆదినారాయణ పార్టీ మారినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ నేత కామిశెట్టి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఒప్పందం ప్రకారం రాజీనామా చేస్తానని బహిరంగంగా ప్రకటించిన భూపతి ఆదినారాయణ.. పదవీ వ్యామోహంతోనే తెరచాటు వ్యవహారాలకు తెరలేపారని ఆరోపించారు. ప్రస్తుతం నిడదవోలు చైర్మన్ కుర్చీపై రాజకీయం వాడి వేడిగా కొనసాగుతుంది.
Also Read:
జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది..: ఎమ్మెల్యే
పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్..
గుడ్ న్యూస్.. రూ. 6 వేలు తగ్గిన బంగారం ధర
For More Andhra Pradesh News and Telugu News..