AP News: మీడియాకు నాసిన్ అకాడమి వివరాలు ఇవ్వని అధికారులు.. గోప్యంగా ప్రారంభోత్సవం
ABN , Publish Date - Jan 16 , 2024 | 01:00 PM
Andhrapradesh: జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మీడియాపై అధికారులు ఆంక్షలు విధించారు. మోదీ పర్యటనలో మీడియాకు అనుమతి నిరాకరించారు. జిల్లా పర్యటనలో భాగంగా గోరంట్ల మండలం పాల సముద్రం వద్ద నాసిన్ అకాడమీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా, జనవరి 16: జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పర్యటన సందర్భంగా మీడియాపై అధికారులు ఆంక్షలు విధించారు. మోదీ పర్యటనలో మీడియాకు అనుమతి నిరాకరించారు. జిల్లా పర్యటనలో భాగంగా గోరంట్ల మండలం పాల సముద్రం వద్ద నాసిన్ అకాడమీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan Reddy), గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) పాల్గొననున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక నాసిన్ ప్రారంభోత్సవాన్ని ఐ అండ్ పి ఆర్ డిపార్ట్‌మెంట్ పట్టించుకోని పరిస్థితి. అనుమతి లేదంటూ నాసిన్ మెయిన్ గేట్ వద్ద మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో నాసిన్ నిర్మాణం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అప్పటి సీఎం చంద్రబాబు (TDP Chief Chandrababu) నాసిన్‌ను ప్రతిష్టత్మకంగా తీసుకుని శంఖుస్థాపన చేశారు. నాసిన్ ప్రాధాన్యత గురించి అధికారులు మీడియాకు కూడా వివరాలు వెల్లడించారు. అయితే ఇప్పుడు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండానే గోప్యంగా ప్రారంబోత్సవం జరుగుతోంది. కనీసం మీడియాకు నాసిన్ అకాడమీ వివరాలను పౌర సంబంధాల శాఖ వెల్లడించని పరిస్థితి. భూములు త్యాగం చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పరిహారం చెల్లించకపోవడం గమనార్హం.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..