Share News

Gummadi Sandhya Rani: గిరిజన పాఠశాల టీచర్ ఉద్యోగస్తులకు ఎటువంటి అన్యాయం జరగదు

ABN , Publish Date - Jul 03 , 2024 | 01:58 PM

డీఎస్సీ నోటిఫికేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ గిరిజన పాఠశాల టీచర్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత నాలుగు రోజుల నుంచి తాము పడుతున్న ఆవేదనను గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి దృష్టికి ట్రైబల్ టీచర్ ఉద్యోగులు తీసుకెళ్లారు. మంత్రి హామీతో నిరసన కార్యక్రమాన్ని ఉద్యోగులు విరమించారు.

Gummadi Sandhya Rani: గిరిజన పాఠశాల టీచర్ ఉద్యోగస్తులకు ఎటువంటి అన్యాయం జరగదు

అమరావతి: డీఎస్సీ నోటిఫికేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ గిరిజన పాఠశాల టీచర్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత నాలుగు రోజుల నుంచి తాము పడుతున్న ఆవేదనను గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి దృష్టికి ట్రైబల్ టీచర్ ఉద్యోగులు తీసుకెళ్లారు. మంత్రి హామీతో నిరసన కార్యక్రమాన్ని ఉద్యోగులు విరమించారు. ఈ సందర్భంగా గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. గిరిజన పాఠశాల టీచర్ ఉద్యోగస్తులకు ఎటువంటి అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. వారి ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు.


గిరిజన పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు మొదటి నుంచి టీడీపీ అండగా ఉందని గుమ్మడి సంధ్యారాణి ల్లడించారు. గత ఐదేళ్లలో గిరిజన పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయానికి గురి చేస్తోందన్నారు. కొంతమంది ఉద్దేశాపూర్వకగా ఉద్యోగస్తులను రెచ్చగొడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో కనీసం ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగ సమస్యలపై పిలిచి మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఏ ఒక్క ఉద్యోగికి కూడా అన్యాయం జరగబోదని గుమ్మడి సంధ్యారాణి తేల్చి చెప్పారు. దీంతో ఉద్యోగులంతా ఆందోళనను విరమించారు.

Updated Date - Jul 03 , 2024 | 01:58 PM