Share News

Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్.. అనంతరం వెంటనే..

ABN , Publish Date - Jun 19 , 2024 | 07:37 AM

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 9.30 పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు.

Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్.. అనంతరం వెంటనే..

అమరావతి: ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 9.30 పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ పవన్ చర్చించనున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కల్యాణ్ బిజీగా ఉండనున్నారు.


నేడు తన మంత్రిత్వ శాఖలు అయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో.. ఉదయం 9:00 నుంచి 10.00 మధ్య బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయం 11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో సమావేశం... 12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో పవన్ భేటీ కానున్నారు.

Updated Date - Jun 19 , 2024 | 07:37 AM