Share News

MLC Elections : ప్రశాంతంగా టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:52 AM

ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

 MLC Elections : ప్రశాంతంగా టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

  • ఉభయ గోదావరి జిల్లాల్లో 92.62శాతం పోలింగ్‌

కలెక్టరేట్‌(కాకినాడ), ఏలూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్‌ కేంద్రాల్లో 92.62శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా 16,737మంది ఓటర్లకు గాను 15,502 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. కాకినాడ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఏఆర్వో ఆధ్వర్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని నిత్యం పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలో పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌ వెట్రిసెల్వి.. బ్యాలెట్‌ బాక్సులకు వేసిన సీళ్లను పరిశీలించారు. కాకినాడ జేఎన్‌టీయూలో ఈనెల 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రానికి ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.

Updated Date - Dec 06 , 2024 | 04:52 AM