Share News

పోలవరానికి పండగే

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:41 AM

ప్రాజెక్టులకు జలకళ వచ్చేలా కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జల వనరుల శాఖకు రూ.16,705 కోట్లు ప్రతిపాదించింది.

పోలవరానికి పండగే

రూ.5,448 కోట్లు కేటాయింపు

జలవనరుల శాఖకు 16,705 కోట్లు

నిరుడు జగన్‌ హయాంలో 11,908 కోట్లు

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులకు జలకళ వచ్చేలా కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జల వనరుల శాఖకు రూ.16,705 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో ప్రధాన వాటా పోలవరం ప్రాజెక్టుకే. దానికి రూ.5,448.62 కోట్లు కేటాయించారు. అలాగే రాయలసీమ ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగేలా నిధులు ప్రతిపాదించారు. గడచిన ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం కనీసం ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నిధులివ్వలేదు. ఇప్పుడు ప్రాధాన్య పథకాలకు పెద్దపీట వేయడంతో పాటు అన్ని ప్రాజెక్టుల నిర్వహణకూ కేటాయింపులు జరిపారు. జగన్‌ ప్రభుత్వం జలవనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయించింది. తర్వాత చేపట్టిన సవరణల్లో తొలిసారిగా కేటాయించిన నిధులను రూ.8,371 కోట్లకు కుదించింది. తగ్గించిన ఈ నిధులను కూడా ఇవ్వకపోవడంతో ప్రాజెక్టులన్నీ పడకేశాయి. తాజా బడ్జెట్‌లో కర్నూలు ప్రాజెక్టలకు రూ.561.94 కోట్లు, అనంత ప్రాజెక్టులకు రూ.2,014 కోట్లు, కడప ప్రాజెక్టులకు రూ.2,889 కోట్లు, తెలుగుగంగకు రూ.887 కోట్లు. గాలేరు-నగరికి రూ.2,439 కోట్లు, హంద్రీ-నీవాకు రూ.812 కోట్లు, పులివెందుల కెనాల్‌-305 కోట్లు, తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ-22 కోట్లు, ఎల్‌ఎల్‌సీ-31 కోట్ల్లు ప్రతిపాదించారు.

Updated Date - Nov 12 , 2024 | 04:41 AM