డయాఫ్రం వాల్ ప్లాట్‌ఫాం పనులు ప్రారంభం
ABN , Publish Date - Nov 27 , 2024 | 04:26 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాట్‌ఫాం పనులను మంగళవారం జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు.
పోలవరం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాట్‌ఫాం పనులను మంగళవారం జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నడుమ ఉన్న పాత డయాఫ్రం వాల్‌కు సమీపంలో నూతన వాల్ నిర్మాణం కోసం గైడ్ వాల్ పనులు ఇప్పుడు మొదలయ్యాయి. జనవరిలో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ పనులు ప్రారంభించినట్లు ఈఈ సుధాకర్ తెలిపారు. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నడుమ మట్టి, ఇసుక నాణ్యత పరిశీలన చేపట్టారు.