Smuggling: పుష్ప సినిమా సీన్‌ను మించి స్కెచ్.. పోలీసులే షాక్..
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:45 AM
కొట్టక్కి చెకిపోన్లు వద్ద గురువారం ఉదయం భారీ ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొబ్బిలి డీఎస్సీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
రామభద్రపురం, డిసెంబరు 13: కొట్టక్కి చెకిపోన్లు వద్ద గురువారం ఉదయం భారీ ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొబ్బిలి డీఎస్సీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పక్కా సమాచారంతో పట్టుకున్నారు. రెండో కంటికి తెలియకుండా బొగ్గు లోడులో గంజాయి దాచి తరలించాలనుకున్న స్మగ్లర్ల వ్యూహాన్ని చాకచక్యంగా ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పాడువా నుంచి తొలుత రెండు మినీ వాహనాల్లో 30 బ్యాగులతో సుమారు 800 కిలోల గంజాయిని పాచిపెంట మండలం వరకు తీసుకొచ్చారు. అక్కడ బొగ్గులోడుతో ఉన్న లారీలోకి గంజాయిని మార్చారు. వాటిపైన కూడా బొగ్గు బస్తాలు కప్పేశారు. ఎవరికీ అనుమానం రాదనుకున్నారు.
పక్కా సమాచారంతో బొబ్బిలి సీఐ కె.నారాయణ రావు, రామభద్రపురం ఎస్ఐ వెలమల ప్రసాదరావుల బృందం బుధవారం అర్థరాత్రి నుంచి కొట్టక్కి వద్ద ఒడిశా నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. బొగ్గు లారీ కొట్టక్కి, సమీపానికి రాగానే చెక్‌పోస్టు వద్ద పోలీసులు మెరుపుదాడి చేసి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనిఖీ చేయగా గంజాయి మూటలను గుర్తించారు. వెనుక అనుసరిస్తున్న రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది పరారైనట్టు సమాచారం. చెక్‌పోస్టు వద్ద బొగ్గులారీలో ఉన్న గంజాయి బస్తాలను కిందకు దించి తూకం వేసి రామభద్రపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెద్ద మొత్తంలో గంజాయి దొరకడం రామభద్రపురంలో మొదటిసారి. సూత్రదారుల కోసం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
Also Read:
ఈ-కార్ రేస్ స్కామ్‌లో సంచలన పరిణామం..
రైతులకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే..
జగన్‌కు షాక్.. ఆ భూములు వెనక్కి..
For More Andhra Pradesh News and Telugu News..