Share News

AP News: కోడికత్తి శ్రీను కుటుంబానికి పెరుగుతున్న మద్దతు

ABN , Publish Date - Jan 20 , 2024 | 01:23 PM

Andhrapradesh: కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడో రోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఘీభావం తెలుపుతున్నాయి.

AP News: కోడికత్తి శ్రీను కుటుంబానికి పెరుగుతున్న మద్దతు

విజయవాడ, జనవరి 20: కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడో రోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఘీభావం తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. గత 72 గంటలుగా కోడికత్తి తల్లి, సోదరుడి దీక్ష కొనసాగుతోంది. దీంతో కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. సావిత్రమ్మ ఆరోగ్యంపై కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులు, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కోడి కత్తి శ్రీను కుటుంబానికి మాజీ ఎంపీ హర్షకుమార్ (Former MP Harsha Kumar) సంఘీభావం తెలిపారు. దాదాపు రెండు బసుల్లో జనంతో వచ్చి హర్షకుమార్ మద్దుతునిచ్చారు. అంతుకు ముందు ఉదయం కోడి కత్తి శ్రీను కుటుంబానికి తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, బోండా ఉమ, మాణిక్యాలరావు, శిబ్లి మద్దుతు తెలియజేశారు.


శ్రీను కుటుంబంపై ఒత్తిడి...

కాగా.. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యుల దీక్ష కొనసాగుతోంది. అయితే ఫంక్షన్ హాలు ఖాళీ చేయాలని కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిపై ఒత్తిడి వస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షకు సమతా సైనిక్ దళ్ మద్దతు ఇస్తోంది. దీక్షపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాత్రంతా దీక్షా ప్రాంగణంలోనే పోలీసులు బస చేశారు. ఫంక్షన్ హాలు ఖాళీ చేయించాలని యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నది పోలీసులేనని సమత సైనిక్ దళ్ ఆరోపిస్తోంది. మరోవైపు కోడికత్తి శ్రీను కూడా విశాఖ జైలులో మూడో రోజు దీక్ష కొనసాగిస్తున్నాడు. ఇవాళ కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నిన్న దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేయగా.. పోలీసులకు, సమతా సైనిక్ దళ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 20 , 2024 | 01:23 PM