RGV: రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద పోలీసులు.. ఏ క్షణమైనా అరెస్టు..
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:24 PM
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Director Ram Gopal Varma) అరెస్టుకు రంగం సిద్ధమైంది. (Any Moment Arrest) ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేసి మద్దిపాడుకు తీసుకువెళ్లేందుకు పోలీసులు (Police) ఆర్జీవీ నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో (Morphing case) రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసులోభాగంగా ఈనెల 19న మొదటిగా విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల సమయం కావాలని విజ్ఞప్తి చేయగా.. సానుకూలంగా స్పందించిన పోలీసులు వారం రోజుల సమయం ఇచ్చారు. ఇచ్చిన గడువు ముగియడంతో సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా వర్మ విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మద్దిపాడు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే రాంగోపాల్ వర్మ ఇంట్లో లేరని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పారు. దీంతో పోలీసులు మాత్రం ఆర్జీవీ నివాసం వద్దే ఉన్నారు.
కాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. ఈరోజు (సోమవారం) విచారణకు హాజరుకావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు అయ్యింది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటి సారి ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈరోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు ఇచ్చారు. అయితే ఈరోజు విచారణకు కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరుకావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్‌కు వర్మ సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఘటనకు బీజేపీదే బాధ్యత: రాహుల్
చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..
సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News