Home » Police case
ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలంటూ మాదాపూర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి పోలీసులు ఈ మేరకు నోటిసులు అంటించారు.
దోపిడీ కోసం వచ్చిన దొంగలు తెలివిగా తమిళనాడుకు సంబంధించిన ఓమిని వాహనంలో ప్రెస్ బోర్డు వేసుకొని వచ్చారు. ఆ ఓమిని వాహనానికి తమిళనాడులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఉంది. మొత్తం ఐదుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరో దొంగ తప్పించుకోవడంతో పోలీసులు రిస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయిన చంద్రశేఖర్ రెడ్డి.. తరువాత ప్రైవేట్ కాలేజీలో లేచ్చరర్గా ఉద్యోగం చేశారు. ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వంశీని మరోసారి విచేరించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటు పోలీసులు వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో వంశీని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
అనంతపురం: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ తల్లికి కేవలం కూతుళ్లు మాత్రమే దగ్గరుండి సర్జరీ చేయించినట్టు పోలీసుల విచారణలో బట్టబయలైంది.చెన్నై అపోలో హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించారు.
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ బుధవారం పోలీసుల విచారణకు రానున్నారు. ఈ క్రమంలో భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. గోరంట్లపై మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజధాని హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పరిధిలో జరిగిన వివాహిత సింగం శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను ఆమె భర్త వినయ్‌కుమార్, ఆడపడచు కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో వినయ్‌తోపాటు అతని అక్కను అరెస్టు చేశారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కర్నూలు జిల్లా, ఆదోనిలో మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు పీటీ వారెంట్‌పై గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలుకు తరలించారు. విచారణ జరిపిన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణా పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్‌కు విధించారు.
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ 351 (2), ఆర్ డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు.