ABN Effect: ఆ వృద్ధిరాలి కథ సుఖాంతం..
ABN , Publish Date - Dec 17 , 2024 | 10:48 AM
నడిరోడ్డుపై వదిలేసిన 75 ఏళ్ల వృద్ధిరాలు వెంకట లక్ష్మమ్మపై ఏబీఎన్ ప్రసారంతో ఆమెకు ఊరట లభించింది. ఆమె ముగ్గురు కొడుకులు ఆస్తులు పంచుకుని తల్లిని నడిరోడ్డుపై వదిలేశారు. 20 రోజులుగా ఆమె చలిలో ఇబ్బందులు పడుతోంది. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆమె దీనగాథపై కథనం ప్రసారమైంది. దీంతో...
ప్రకాశం జిల్లా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) కథనానికి ప్రకాశం జిల్లా అధికారులు స్పందించారు. కన్నతల్లిని నడిరోడ్డుమీద వదిలేసిన కొడుకులను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ (Counseling) ఇచ్చారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ (Venkata Lakshmamma) అనే వృద్ధిరాలి ఆస్తులు పంచుకున్న ముగ్గురు కొడుకులు ఆమెను నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వృద్ధిరాలి పరిస్థితిపై వార్తను ప్రసారం చేసింది. దీంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ (SI Venkateswara Nayak) గ్రామానికి చేరుకుని వృద్ధిరాలి కొడుకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో కుమారులు తల్లిని తమ ఇంటికి తీసుకువెళ్లారు.
వృద్ధిరాలికి ఊరట..
నడిరోడ్డుపై వదిలేసిన 75 ఏళ్ల వృద్ధిరాలు వెంకట లక్ష్మమ్మపై ఏబీఎన్ ప్రసారంతో ఆమెకు ఊరట లభించింది. ఆమె ముగ్గురు కొడుకులు ఆస్తులు పంచుకుని తల్లిని నడిరోడ్డుపై వదిలేశారు. 20 రోజులుగా ఆమె చలిలో ఇబ్బందులు పడుతోంది. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆమె దీనగాథపై కథనం ప్రసారమైంది. దీంతో వెంటనే స్పందించిన ఎస్ఐ వెంకట లక్ష్మమ్మ కొడుకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. దీంతో ముగ్గురు కొడుకులు తల్లిని ఇంటికి తీసుకువెళ్లారు.
పూర్తి వివరాలు..
నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి వృద్దాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకులు మొహం చాటేశారు. నడిరోడ్డుపై కన్నతల్లిని వదిలేశారు. అంతేకాకుండా వృద్ధురాలికి వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా తీసుకుని విడిచిపెట్టారు. మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఈ సంఘటన ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, వెన్నంపల్లి గ్రామంలో జరిగింది.
వెన్నంపల్లి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ అనే వృద్ధురాలి భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తర్వాత తన ముగ్గురు కుమారుల వద్ద ఆమె ఉండేది. అయితే కన్న తల్లిని పోషించడం భారంగా భావించిన కొడుకులు ఆమెను తీవ్రంగా వేధించేవారు. ఆస్తులు కూడా పంచుకున్నారు. అదే విధంగా వృద్ధురాలికి వస్తున్న పెన్షన్ సమయం రాగానే ప్రతినెల ఆమెను బలవంతంగా తీసుకువెళ్లేవారు. ఆ డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత తల్లిని వదిలిపెట్టి వెళ్లిపోయేవారు. ఆమె నివసిస్తున్న ఇల్లు గతంలోనే కూలిపోయింది. దీంతో స్థిర నివాసం లేక ఆమె నడి రోడ్డుపై ఉంటోంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్..
కొమరోలు మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో దీనావస్థలో ఉన్న వృద్ధురాలు లక్ష్మమ్మను ఆమె కుమారుడు ఇంటికి తీసుకెళ్లారు. ‘అయ్యో.. అమ్మ’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనానికి కొమరోలు ఎస్సై వెంకటేశ్వరనాయక్ స్పందించారు. వెన్నంపల్లి వెళ్లి వృద్ధురాలి పరిస్థితిని తెలుకొని ఆమె ముగ్గురు కుమారులను కొమరోలు స్టేషన్‌కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో చిన్న కుమారుడు తల్లిని వెంట తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చారు. లక్ష్మమ్మను కొమరోలులోని ఇంటికి తీసుకెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..
అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్
ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News