AP News: ఏడుగురు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాళ్ళు, GGH సూపరింటెండెంట్ల బదిలీలు
ABN , Publish Date - Oct 27 , 2024 | 08:33 AM
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఏడుగురు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాళ్ళు, జీజీహెచ్ (GGH) సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ దశలో మంజూరైన 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రత్యామ్నాయ మార్గాల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ను బదిలీ చేయాలని నిర్ణయించింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఏడుగురు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్స్ (Pinciples), జీజీహెచ్ (GGH) సూపరింటెండెంట్లను (Superintendents) బదిలీ (Transfer)చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ దశలో మంజూరైన 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రత్యామ్నాయ మార్గాల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎస్.వీఎన్. రాజమన్నార్, (అనాటమి) నెల్లూరు ఎసిఎస్ఆర్ జీఎంసీ, ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది.
అలాగే పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న డా. శ్రీదేవి (ఎస్పీఎం) నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బదిలీ.. మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. టి. జమున (ఎనస్థియాలజీ) ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా బదిలీ.., మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డా. ఎం.ఎస్ రాజు (పీడియాట్రిక్స్) ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ.., పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. డి. మల్లీశ్వరి (పీడియాట్రిక్స్) నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ.., మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. పి. సావిత్రి (అనాటనమి)ను ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బదిలీ.., ఆదోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. శ్రీరాములు (మెడిసిన్), కర్నూలు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌గా బదిలీ.., పై వారిలో మొదటి ఆరుగురు ఏడీఎంసీ స్థాయిలో ఉన్నారు. క్లినికల్ సబ్జెక్టుల స్పెషలిస్టులను సూపరింటెండెంట్‌లు గాను, నాన్ క్లినికల్ వారిని ప్రిన్సిపల్స్ గాను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ప్రకాశం జిల్లా, ఒంగోలు పంచాయతీ కార్యాలయ పరిధిలో పనిచేసే కార్యదర్శులు (సచివాలయ ఉద్యోగులు) నెలరోజుల నుంచి పోస్టింగ్‌లు లేక రోడ్డున పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందుకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు శ్రీకారం చుట్టారు. ఇతర శాఖల్లో ఆ ప్రక్రియ సాఫీగా సాగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మాత్రం అస్తవ్యస్తమయ్యాయి. ఆశాఖ పూర్వ డీపీవో చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఉద్యోగులకు పోస్టింగ్‌లు లేక గాలిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నా ఇష్టారీతిన వ్యవహరించిన కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గతనెల 22 వరకూ గడువు ఇచ్చింది. ఆతర్వాత బదిలీల ప్రక్రియను నిషేధించింది. అనంతరం రెండు, మూడు రోజులు పాత తేదీలతో బదిలీ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకున్న పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఇప్పుడు ఆ ఉద్యోగులకు పోస్టింగ్‌లు లేక నిరంతరం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 53 మంది సచివాలయ ఉద్యోగులకు పోస్టింగ్‌లు లేని పరిస్థితి ఏర్పడింది. అందులో గ్రేడ్-6 ఉద్యోగులు ముగ్గురు, గ్రేడ్-5 ఉద్యోగులు 50మంది ఉన్నారు. వీరాంతా రానున్న రోజుల్లో ఉద్యోగోన్నతుల విషయంలో నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసు ఆధారంగా ఉద్యోగోన్నతులు లభిస్తాయి. అయితే ఈ 53 మంది ఉద్యోగులు ప్రస్తుతం సర్వీసును సుమారు నెలరోజులకుపైగా కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు అనేది కూడా ఎంతో కీలకం. దాన్ని రోడ్డున పడేయడంతో ఉద్యోగులు మదనపడిపోతున్నారు.
పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే..
ఇటీవల సచివాలయ ఉద్యోగుల బదిలీల అవినీతి, అక్రమాలపై జిల్లా ఫారెస్ట్ అధికారి లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సమగ్ర విచారణ చేసి కలెక్టర్ తమీమ్ అన్సారియాకు నివేదికను అందజేసింది. అందులో పూర్వపు అధికారి చేసిన తప్పిదం వల్లనే ఉద్యోగులకు పోస్టింగ్ దక్కలేదని రాసినట్లు సమాచారం. మరోవైపు పోస్టింగ్‌ల ఆర్డర్లు అందని ఉద్యోగులు కూడా ఇదే విషయాన్ని విచారణాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు నివేదికలో పోస్టింగ్‌లు అందని ఉద్యోగుల వివరాలను కూడా పొందుపర్చినట్లు సమాచారం. దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా వెంటనే ప్రస్తుత జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడుతో చర్చించినట్లు తెలిసింది. పోస్టింగ్‌లు ఇవ్వని ఉద్యోగుల వివరాలతో జాబితా రూపొందించి తదుపరి చర్యల కోసం పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖ రాయాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఆయా ఉద్యోగుల జాబితాను రూపొందించి కమిషనరేట్‌కు పంపించినట్లు సమాచారం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వారికి ఉద్యోగ పోస్టింగ్‌లు వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News