Share News

Vijayawada : రాజధాని గ్రామాలకు రక్షిత నీరు

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:26 AM

రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా పనులు ప్రారంభయ్యాయి.

Vijayawada : రాజధాని గ్రామాలకు రక్షిత నీరు

  • తుళ్లూరు కేంద్రంగా శుద్ధి.. 29 గ్రామాలకు పంపిణీ

విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా పనులు ప్రారంభయ్యాయి. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం 29 గ్రామాలకు దశల వారీగా రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు సీఆర్‌డీఏ నేతృత్వంలో ఇటీవల టెండర్లు పిలిచారు. తొలిదశలో సగం గ్రామాలకు మంచినీటిని అందించేందుకు ప్రస్తుతం పనులు ప్రారంభించారు. కృష్ణా నది నుంచి నీటిని సేకరించి తుళ్లూరు కేంద్రంగా వాటిని శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా రాజధాని ప్రాంత గ్రామాలకు తరలిస్తారు. ప్రస్తుతం ఆ నీటి సరఫరా పైపులైన్ల పనులు జోరుగా జరుగుతున్నాయి. అలాగే అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌లో భాగంగా నరికిన ముళ్లపొదలను బ్లోయర్‌ మెషీన్ల ద్వారా పొట్టుగా మారుస్తున్నారు. ఈపొట్టును వంటచెరుకుగా, ఇటుకల తయారీకి, ఇతర పనులకు ఉచితంగా అందిస్తున్నారు.

Updated Date - Nov 29 , 2024 | 04:26 AM