Share News

Puttaparthi: పుట్టపర్తిలోనూ... రతన్‌టాటా సేవలు

ABN , Publish Date - Oct 11 , 2024 | 01:21 PM

పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు పుట్టపర్తి(Puttaparthi)తో విడదీయరాని బంధం ఉంది. సామాజిక సేవ, దాతృత్వం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రతన్‌ టాటా.. సత్యసాయి బాబా సూచన మేరకు విద్యావాహిణి ప్రాజెక్టుకు సహకారం అందించారు.

Puttaparthi: పుట్టపర్తిలోనూ... రతన్‌టాటా సేవలు

- 2009లో ప్రశాంతి నిలయం సందర్శన

పుట్టపర్తి(అనంతపురం): పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు పుట్టపర్తి(Puttaparthi)తో విడదీయరాని బంధం ఉంది. సామాజిక సేవ, దాతృత్వం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రతన్‌ టాటా.. సత్యసాయి బాబా సూచన మేరకు విద్యావాహిణి ప్రాజెక్టుకు సహకారం అందించారు. సత్యసాయిబాబాతో రతన్‌టాటా((Ratan Tata))కు విడదీయరాని అనుబంధం ఉండేది. సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు, సేవలకు ఆకర్షితుడైన రతన్‌టాటా మొదటిసారి 2009 డిసెంబరు 3న ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సత్యసాయి ధర్మవనంలో సేవలను స్వయంగా పరిశీలించారు. తాను సైతం సేవా కార్యక్రమాల్లో భాగస్వాముడినవుతానని బాబాను కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: AP News: కొన్ని పత్రికలకు అర్హత లేకపోయినా కోట్ల రూపాయలు యాడ్స్: మంత్రి కొలుసు


pandu4.jpg

దీంతో సత్యసాయిబాబా.. శ్రీసత్యసాయి విద్యావాహిణి ప్రాజెక్టులో పాలుపంచుకోవాలని బాబా సూచించారు. 2010 నవంబరు 23న సత్యసాయి తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా శ్రీసత్యసాయి విద్యావాహిణి ప్రాజెక్టును ప్రారంభించారు. మొదటి విడతలో 9 లక్షల మందికి విద్య అందించడానికి రతన్‌టాటా ముందుకొచ్చారు. తద్వారా మాతృభూమికి సేవ, బాధ్యతాయుత, ఆధ్యాత్మిక సేవలతో కూడిన విలువల విద్యను అందించి, దృఢసంకల్పం కలిగిన యువతను తయారు చేసేందుకు విద్యావాహిణి ప్రాజెక్టు పనిచేసింది. ప్రాజెక్టులో వేలాదిమంది ఉపాధ్యాయులు చేరి.. లక్షలాది మంది విద్యార్థులకు పాఠాలు బోధించారు. అలా రతన్‌టాటా.. సత్యసాయి సేవలకు తనవంతు సహకారం అందించి, భక్తిని చాటుకున్నారు. పుట్టపర్తితో విడదీయరాని బంధం ఏర్పరచుకున్నారు.


...................................................................

ఈ వార్తను కూడా చదవండి:

....................................................................

Bangalore: రతన్‌ టాటాకు భారతరత్న ఇవ్వాలి..

- వాణిజ్య పరిశ్రమల మండలి డిమాండ్‌

బళ్లారి(బెంగళూరు): భారతీయ ప్రరిశ్రమలను ప్రపంచ స్థాయిలో అభివృద్ది చేసిన గొప్ప దేశభక్తుడు రతన్‌ టాటా(Ratan Tata)ను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించాలని బళ్లారి జిల్లా వాణిజ్య పరిశ్రమల సంఘం పేర్కొంది. రతన్‌ టాటా ఆత్మ కోసం శాంతికోసం నిర్వహించిన సభకు అధ్యక్షత వహించిన బళ్లారి జిల్లా వాణిజ్య పరిశ్రమల మండలి అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ, టాటా ఎప్పుడూ సాహసాలు, సవాళ్లను స్వీకరిస్తూ అద్భుతాలు సాధించే దిశగా అడుగులు వేశారన్నారు.


zzz.jpg

రతన్‌ టాటా దేశానికి అమూల్యమైన రత్నమని, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పరిశ్రమకు ఒక బ్రాండ్‌ను నిర్మించిన ఘనత ఆయనదేన్నారు. ఆయన లాంటి పారిశ్రామికవేత్త, పరోపకారి, విద్యాభిమాని, దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రద్ద వహించే వ్యక్తి మళ్ళీ పుట్టాలన్నారు. ప్రతి పారిశ్రామికవేత్త రతన్‌ టాటా జీవితాన్ని ఆదర్శంగా స్వీకరించి దేశానికి సేవ చేయాలన్నారు. మాజీ అధ్యక్షుడు రుద్రగౌడ మాట్లాడుతూ రతన్‌టాటా గొప్పమానవతావాది, పారిశ్రామికవేత్త, విద్యావేత్త, పరోపకారి అంటూ ఆయన ఆశయాలను అందరం అలవర్చుకోవాలన్నారు.


రతన్‌ టాటా నిష్క్రమణ దేశానికి దిగ్ర్భాంతి కలిగిస్తుందన్నారు. టాటా గ్రూపు కంపెనీలను సమర్ధంగా అభివృద్ది చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కోవిడ్‌ సమయంలో కేంద్రప్రభుత్వానికి రూ.2500 కోట్ల విరాళం అందించిన ఘనత ఆయనదేనన్నారు. అవసరమైతే మరింత డబ్బు ఇస్తానని చెప్పగల ధైర్యం, సాహసం ఆయన సొంతమన్నారు. ఈ సందర్భంగా జిల్లా వాణిజ్య పరిశ్రమల శాఖ గౌరవ కార్యదర్శి సురేశ్‌బాబు, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్‌,జితేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2024 | 01:24 PM