SC Categorization : వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌కు 377 వినతులు
ABN , Publish Date - Dec 29 , 2024 | 06:39 AM
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌కు 377 వినతులు అందాయి.
మచిలీపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌కు 377 వినతులు అందాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, కలెక్టర్ బాలాజీతో కలిసి శనివారం ఎస్సీ సామాజిక వర్గాలు, అనుబంధకులాల ప్రతినిధుల నుంచి వినతులను స్వీకరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన సంఘాల ప్రతినిధులు వినతులు అందజేశారు.