Share News

Hyderabad Resident : తిరుమల నడకదారిలో భక్తుడు మృతి

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:49 AM

స్నేహితులతో సరదా మాట్లాడుతూ.. తిరుమల నడక మార్గంలో వెళుతున్న ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.

Hyderabad Resident : తిరుమల నడకదారిలో భక్తుడు మృతి

  • మృతుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి

తిరుమల, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్నేహితులతో సరదా మాట్లాడుతూ.. తిరుమల నడక మార్గంలో వెళుతున్న ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌కు చెందిన సీహెచ్‌.రవికుమార్‌(38) ఐదుగురు స్నేహితులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకున్నాడు. అలిపిరి నుంచి తిరుమలకు నడక ప్రారంభించారు. 2,500వ మెట్టు వద్దకు చేరేసరికి రవికుమార్‌ ఒక్కసారిగా ఛాతీనొప్పితో కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు.

Updated Date - Dec 14 , 2024 | 04:49 AM