Rains: అర్ధరాత్రి మంత్రులు అనగాని, గొట్టిపాటి పర్యటన
ABN , Publish Date - Sep 03 , 2024 | 07:54 AM
వరదనీటితో ఒలేరు కట్ట నిండుతోంది. కట్ట రక్షణకు చర్యలు తీసుకున్నారు. రేపల్లె పట్టణ ప్రజలు సరక్షితం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. రేపల్లె మండలంలో గల వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి, రావి అనంతవరం, ఒలేరు గ్రామాల్లో అర్ధరాత్రి వరకు మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి పర్యటించారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వాన దంచికొడుతోంది. వర్షంతో వరదనీరు పోటెత్తుతోంది. సహాయక చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రేయింబవళ్లు సహాయక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మంత్రులు, అధికారులు, సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రేపల్లెలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ అర్ధరాత్రి పర్యటించారు.
నిండుతోన్న ఒలేరు కట్ట
వరదనీటితో ఒలేరు కట్ట నిండుతోంది. కట్ట రక్షణకు చర్యలు తీసుకున్నారు. రేపల్లె పట్టణ ప్రజలు సరక్షితం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. రేపల్లె మండలంలో గల వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి, రావి అనంతవరం, ఒలేరు గ్రామాల్లో అర్ధరాత్రి వరకు మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి పర్యటించారు. రాత్రి రెండు గంటల వరకు ఓలేరు కట్ట పరిస్థితిని పర్యవేక్షించారు. కూటమి కార్యకర్తలు, అధికారులు కష్టపడి ఓలేరు కట్టను రక్షిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. మరో రోజు గడిస్తే రేపల్లె పట్టణానికి ప్రమాదం తప్పినట్టేనని పేర్కొన్నారు. ఈ లోగా ప్రత్యామ్నయ ఏర్పాట్లు కూడా చేశామని వివరించారు. అవసరమైతే ఒలేరు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రేపల్లె ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
ఏపీ సీఎం చంద్రబాబు రేయింబవళ్లు వరద సహాయక కార్యక్రమాల్లో ఉన్నారు. మంత్రులు, అధికారుల పర్యటన, వరద సహాయక చర్యలను మంత్రి లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల, ప్రజలకు ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.