DEVOTIONAL : భగవద్గీత పఠన పోటీలకు స్పందన
ABN , Publish Date - Dec 09 , 2024 | 12:33 AM
గీతాజయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పఠన పోటీలకు విశేష స్పందన లభించింది. ఆరు నుంచి 9వ తరగతి వరకు రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు వందమంది విద్యార్థులు పాల్గొని భగవద్గీత పఠనం చేశారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : గీతాజయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పఠన పోటీలకు విశేష స్పందన లభించింది. ఆరు నుంచి 9వ తరగతి వరకు రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు వందమంది విద్యార్థులు పాల్గొని భగవద్గీత పఠనం చేశారు. ఈ పోటీల్లో 6, 7 తరగతుల విభాగంలో విద్యార్థులు విష్ణుప్రియ, హేమాచలం, శ్యామల వరుసగా పథ్రమ, ద్వితీయ తృతీయస్థానాల్లో గెలుపొందారు. 8, 9వ తరగతుల విభాగంలో జ్ఞానకీర్తి, లహరి, రిషిక ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో గెలుపొందారు. అలాగే సంపూర్ణ భగవద్గీత పఠనంలో సీనియర్స్ విభాగంలో నార్పల నారాయణప్ప, బయన్న, నల్లపరెడ్డి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. పోటీలకు శ్రీపాద వేణు, న్యాయవాది నాగేశ్వరి, పండిట్ వేణు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల అనంతరం విజేతలకు జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో టీటీడీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బాబు, రేనాటి నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....