CM Chandrababu: కోనసీమ జిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే
ABN , Publish Date - Aug 22 , 2024 | 05:37 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో(Ambedkar Konaseema Dist) పర్యటించనున్నారు.
అంబేడ్కర్ కోనసీమ: ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో(Ambedkar Konaseema Dist) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బాబు బయల్దేరతారు.11.40కి కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11.50కి వానపల్లిలోని పళ్ళాలమ్మ గుడి వద్దకు వస్తారు. 11.50 నుంచి1.30 వరకు గ్రామసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
2 గంటల నుంచి 2.20 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో భేటీ అవుతారు. 2.20కి వానపల్లి గ్రామం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.35 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45కు ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.35 గంటలకు తెలంగాణ రాష్ట్రం బేగంపేట ఎయిర్ పోర్టుకి వెళ్తారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4 గంటలకల్లా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.
ఫుడ్ పాయిజన్ బాధితులకు పరామర్శ..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విశాఖపట్నం కేజీహెచ్ వెళ్లారు. ఈసందర్భంగా చిల్డ్రెన్ వార్డును పరిశీలించిన సీఎం...కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం అనాధాశ్రమంలో జరిగిన ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించారు. అనంతరం సీఎంకు ట్రైనీ డాక్టర్లు వినతిపత్రం అందజేశారు. వైద్యుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎంను జూడాలు కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు కావాలని హెచ్చరించారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. కర్ణాటక మాదిరిగా కఠిన చట్టాలు తీసుకువస్తామని... ఇలాంటి ఘటనలు ఎవరూ ఉపేక్షించరని అన్నారు. ఇదే సమయంలో ఆందోళనలు చేస్తున్న ట్రైనీ డాక్టర్లు రోగులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి...
TG News:10 ఐ ఫోన్లను ఆ కొరియర్ బాయ్ ఏం చేశాడో తెలుసా!
Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్
Read Latest AP News