Shock of YCP : వైసీపీకి షాక్
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:31 PM
ప్రొద్దుటూరులో వైసీపీకి మున్సిప ల్ కౌన్సిల్లర్లు వరుసగా షాక్ ఇస్తున్నారు. కౌన్సిల్లర్లు పల్లా రమాదేవి, జిలాన్‌బాషా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యం లో టీడీపీలో చేరారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక
మొత్తం 16కు పెరిగిన బలం
ప్రొద్దుటూరు, అక్టోబరు 1: ప్రొద్దుటూరులో వైసీపీకి మున్సిప ల్ కౌన్సిల్లర్లు వరుసగా షాక్ ఇస్తున్నారు. కౌన్సిల్లర్లు పల్లా రమాదేవి, జిలాన్‌బాషా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యం లో టీడీపీలో చేరారు. మంగళవారం నెహ్రూరోడ్డులోని టీడీపీ కార్యాలయంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వనించారు. సరిగ్గా నాలుగు రోజుల కిందట 39, 33వ వార్డుల వైసీపీ కౌన్సిలర్లు చింపిరి అనిల్, గాజుల శివ జ్యోతి టీడీపీలో చేరారు. వీరి చేరికతో మున్సిపల్ కౌన్సిల్‌లో టీడీపీ బలం 16కు చేరింది. కౌన్సిల్ మొత్తం 40 మంది కాగా త్వరలో మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నా రు. దీంతో మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరితే కౌన్సిల్ టీడీపీ వశమైనట్లేనని భావిస్తున్నారు. త్వరలోనే మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ కైవశం చేసుకోబోతుందని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్ముతూ వైసీపీ నుం చి స్వచ్ఛందంగా టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేష్‌నాయుడు మాట్లాడుతూ ప్రొద్దుటూరు అభి వృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని వారంతా వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారన్నారు. వీరందరికీ పార్టీ అన్ని విధాలా అండగా వుంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఇన్‌చార్జ్ చైర్మెన్ వీఎస్ ముక్తియార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, టౌన్ బ్యాంకు చైర్మెన్ సుబ్బారెడ్డి, టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఘంటశాల వెంక టేశ్వర్లు, కౌన్సిలర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కమాల్‌బాషా, మాజీ కౌన్సిలరు జంబాపురం రామాంజనేయులు, టీడీపీ నేతలు పగిడాల దస్తగిరి వద్ది ఓబులేసు తదితరులు పాల్గొన్నారు