AP News: చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ కేంద్రాలు.. ఎక్కడంటే..
ABN , Publish Date - Nov 18 , 2024 | 10:50 AM
విద్యార్థులకు ఒకే గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న అపార్ (ఆటో మేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నెంబర్ మంజూరుకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. జిల్లాలో మూడు వారాలుగా విద్యార్థులకు ఇస్తున్న ..
మదనపల్లె, నవంబరు 18 : విద్యార్థులకు ఒకే గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న అపార్ (ఆటో మేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నెంబర్ మంజూరుకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. జిల్లాలో మూడు వారాలుగా విద్యార్థులకు ఇస్తున్న ఆపార్ గుర్తింపు కార్డుల కార్యక్రమం 74 శాతం మాత్రమే పూర్తయ్యింది. ఆధార్, ఆపార్ కేంద్రాల కౌంటర్లు ఏర్పాటు చేసినా సాంకేతిక లోపాలు, పుట్టినరోజు తేదీలు, ఇంటిపేర్ల మార్పుల వలన ఆపార్ కార్యక్రమం జోరందుకోలేదు. దీంతో భవిష్యత్‌లో అపార్ గుర్తింపు కార్డుల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 0-6 వయస్సు గల చిన్నారులకు పకడ్బందీగా ఆధార్ నెంబర్లు కేటాయించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
చిన్నారులకు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు..
జిల్లాలో 1,858 మెయిన్, 417 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 0-6 ఏళ్లలోపు చిన్నారులు 94,785 మంది ఉన్నారు. వీరందరికీ ఆధార్ నెంబర్లు కేటాయించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా 30 మండలాల్లో 200 అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా మండలాల ఎంపీడీవోలు ఆధార్ కేంద్రాల నిర్వాహకులు, ఆధార్ కేంద్రాల చిరునామ, తదితర విషయాలను తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తొలి విడతగా ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు, రెండో విడతగా 26 నుంచి 29వ తేదీ వరకు ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాల్లో చిన్నారులకు ఐరిష్, వేలిముద్రల సహాయంతో ఆధార్ నెంబర్లు మంజూరు చేయనున్నారు. గతంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా, ఈ సారి పకకడ్బందీగా చిన్నారులకు ఆధార్ గుర్తింపు కార్డులు మంజూరు. చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోలు పర్యవేక్షించనున్నారు.
అపార్‌కు ఇబ్బందులు రాకూడదనే..
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 2,74,251 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత మూడు వారాలుగా అన్ని మండలాలు, పట్టణాల్లో ఆపార్ కౌంటర్లు ఏర్పాటు చేసి విద్యాశాఖ, మున్సిపల్, మండల పరిషత్ అధికారులు విద్యార్థులకు ఆపార్ నెంబర్లు మంజూరు చేస్తున్నారు. వీరిలో ప్రాధమిక పాఠశాలల్లో 1,16,656 మందికి గాను 1,09,346 మంది విద్యార్థులకు, ప్రాధమికోన్నత పాఠశాలల్లో 80,362 మందికి గాను 65,839 మందికి అపార్ కార్డు నెంబర్లు జనరేట్ అయ్యాయి. తొమ్మిది, 10 తరగతులకు 47,625 మందికి గాను 30,255 మందికి నెంబర్లు జనరేట్ అయ్యాయి. ఇకపోతే ఇంటర్ విద్యార్థులకు 29,608 మందికి గాను 9,501 మందికి మాత్రమే ఆపార్ నెంబర్లు వచ్చాయి. మొత్తం మీద శనివారం నాటికి జిల్లా వ్యాప్తంగా 76.22 శాతం ఆపార్ నెంబర్లు కేటాయించారు.
అపార్ నమోదుపై నిత్యం కలెక్టర్ సమీక్ష..
30 మండలాల్లో అపార్ నమోదు శాతం చూస్తే లక్కిరెడ్డిపల్లె మండలం 86.09 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, బి.కొత్తకోట మండలం 69.08 శాతంతో చివరన ఉంది. కాగా మదనపల్లె, రాజం పేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటంతో ఇక్కడ ఆపార్ నమోదు శాతం కాస్త తక్కువగా అనిపించినా, ఎక్కువ మంది విద్యార్థులు ఉండటంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడి యట్ విద్యార్థులకు అపార్ నెంబర్లు కేటాయించడంతో ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్యలన్నింటిని అధిగమించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ నిత్యం అధికారులతో సమీక్షిస్తున్నారు. సమస్యలన్నింటిని అధిగమించడానికి అధికారులు కృషి చేయాలని సూచిస్తున్నారు. మరో వారం రోజుల్లో జిల్లాలోని అందరు విద్యార్థులకు అపార్ కేటాయింపు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read:
గుడ్ న్యూస్.. రూ. 6 వేలు తగ్గిన బంగారం ధర
చంద్రబాబు అరెస్టు వెనుక సీఐడీ మహాకుట్ర
పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్..
For More Andhra Pradesh News and Telugu News..