Share News

Atchannaidu: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు.. అచ్చెన్న వార్నింగ్

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:45 PM

Andhrapradesh: ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టారని.. అధికారం కోల్పోయినా వైసీపీ తీరు మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పలాసలో సుపారీ గ్యాంగ్ ద్వారా నాగరాజును హత్య చేయాలని ఆలోచించటం దారుణమన్నారు.

Atchannaidu: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు.. అచ్చెన్న వార్నింగ్
Minister Atchannaidu

శ్రీకాకుళం, డిసెంబర్ 23: గత ఐదేళ్లలో రైతు బక్క చిక్కిపోయాడని.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతాంగానికి అచ్చెన్న శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్లు రైతుకు మద్దతు ధర లేదన్నారు. గత ప్రభుత్వం రైతులకు రూ.1600 కోట్లు బకాయిలు పెట్టిందని.. అవన్నీ తాము వచ్చాక క్లియర్ చేశామని తెలిపారు. ఈ యేడాది పెద్ద ఎత్తున దిగుబడి వచ్చిందన్నారు. రైతు పండించే పంటను కొనుగోలు చేసి నాలుగు గంటల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మెకనైజేషన్‌పై ఒక్క రూపాయి పెట్టలేదని విమర్శించారు.

మోహన్‌బాబు అరెస్ట్ ఎప్పుడంటే


వ్యవసాయంలో డ్రోన్లను కూడా వినియోగించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రతి ధాన్యపు గింజా కొంటామని స్పష్టం చేశారు. పల్లె పండగలో భాగంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున రోడ్లు వేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టారని.. అధికారం కోల్పోయినా వైసీపీ తీరు మారలేదని మండిపడ్డారు. పలాసలో సుపారీ గ్యాంగ్ ద్వారా నాగరాజును హత్య చేయాలని ఆలోచించటం దారుణమన్నారు. జిల్లాలో గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. దీని వెనుక సూత్రధారులు ఎవరో తేల్చమని పోలీసులను కోరానని తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు అని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


48 గంటల్లోనే డబ్బులు జమ: మంత్రి పార్ధసారధి

parthasarathi.jpg

అమరావతి: జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు పార్థాసారధి శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల రైతు వ్యతిరేక వైసీపీ ప్రభుత్వంలో రాయితీలు లేక, ఎరువులు అందక, సూక్ష్మ సేద్యం, యంత్ర పరికరాలు దూరమై రైతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు సూక్ష్మ సేద్యం అమలుకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రాయితీపై వ్యవసాయ సామాగ్రి అందించామని.. సహకార సంఘాల్లో రైతులకు ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 గంటలలోపే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని మంత్రి పార్థసారధి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..

ఈ రాశి వారు సన్నిహితుల నుంచే సమస్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 04:45 PM