Parliament: ఎంపీ బాలసౌరి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఏం సమాధానం ఇచ్చారంటే..
ABN , Publish Date - Jul 25 , 2024 | 12:48 PM
న్యూఢిల్లీ: విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులపై పార్లమెంట్‌లో మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలసౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు... విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2020 జూన్‌లో ప్రారంభమయ్యాయని, మొత్తం రూ. 611 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టారన్నారు.
న్యూఢిల్లీ: విజయవాడ (Vijayawada) విమానాశ్రయం విస్తరణ పనులపై (Airport expansion works) పార్లమెంట్ (Parliament)లో మచిలీపట్నం జనసేన ఎంపీ (Janasena MP) వల్లభనేని బాలసౌరి (Vallabhaneni Balashouri) అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (Central Minister) రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) సమాధానం ఇచ్చారు... విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2020 జూన్‌లో ప్రారంభమయ్యాయని, మొత్తం రూ. 611 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టారన్నారు. కరోనా సహా... రాష్ట్రంలో నెలకొన్న ఇతర కారణాల రీత్యా కూడా... పనులు ఆలస్యం అయ్యాయని పేర్కొన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక లభించకపోవడం కూడా ఆలస్యానికి కారణమని చెప్పారు.
విజయవాడ విమానాశ్రయం పనులు ప్రాధాన్యత కింద చేపడుతున్నామని, 2025 జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత పదేళ్ళలో పౌర విమానయాన రంగ మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని, పదేళ్ల క్రితం రైల్వే శాఖకు ఉన్న డిమాండ్ ఇప్పుడు విమానయాన రంగం వైపు మళ్లిందని అన్నారాయన. దాదాపు ప్రతి సభ్యుడు తమకు విమానాశ్రయం, విమానయాన అనుసంధానం అడిగే పరిస్థితి వచ్చిందని బాలసౌరి ప్రశ్నకు సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
గతంలో విజయవాడ నుంచి ముంబైకి రెండు సర్వీసులు ఉండేవని.. వాటిని పునరుద్ధరించాలని సభ్యుడు బాలసౌరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. విజయవాడ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, ముంబైకి విమానాలు నడపాలని... ఢిల్లీ నుంచి విశాఖపట్నం, తిరుపతికి విమాన సర్వీసులు పెంచాలని బాలసౌరి కోరారు.. అలాగే విజయవాడ నుంచి కొలంబో, థాయిలాండ్, సింగపూర్‌కు ప్రయాణీకుల నుంచి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎంపీ బాలసౌరి విజ్ఞప్తి చేశారు. విమాన సర్వీసులు పెంచే విషయంలో మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకునే అధికారం లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని, మంత్రిత్వ శాఖ కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించగలుగుతుందని వెల్లడించారు. సభ్యుల నుంచి వస్తున్న విజ్ఞాపనలను సానుకూలంగా స్వీకరించి.... వాటిని సంబంధిత సంస్థలకు పరిశీలించాలని పంపుతున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గంజాయి మత్తులో అనేక దారుణాలు: హోంమంత్రి అనిత
పవన్ తాటతీస్తున్నారు: పృథ్వీరాజ్
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..
జగన్‌కు షాకిచ్చిన తిరుపతి కార్పొరేటర్లు..
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News