Share News

Nimmala Ramanaidu : పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన జగన్‌

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:16 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్‌ ప్రశ్నార్థకం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Nimmala Ramanaidu :  పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన జగన్‌

మళ్లీ మొదటికొచ్చిన ప్రాజెక్ట్‌ పనులు: మంత్రి నిమ్మల

పాలకొల్లు టౌన్‌, పాలకొల్లు రూరల్‌, జూన్‌ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్‌ ప్రశ్నార్థకం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు 70శాతం పూర్తి చేశారని చెప్పారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో 13 నెలలు పనులు నిలిపేసిందని, అదే సమయంలో గోదావరికి వరదలు రాగా, డయాఫ్రం వాల్‌ను కాపాడకుండా గాలికొదిలేశారన్నారు.

దీంతో డయాఫ్రం వాల్‌ నాలుగుచోట్ల భారీగా దెబ్బతిందని తెలిపారు. దీని మరమ్మతులకు రూ.447కోట్లు ఖర్చవుతుందని, మరమ్మతులు చేపట్టినా పూర్తిగా ఆగుతుందో లేదో నమ్మకం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు చెప్పారన్నారు. కొత్తగా డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రూ.996 కోట్లు అవుతుందని, 4 సీజన్లలోగానీ ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కావని చెప్పారు. అంటే పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తిచేయడానికి నాలుగేళ్లు పడుతుందన్నారు. ్జకాగా.. మంత్రి పదవి చేపట్టినప్పటికీ ప్రజా సేవకుడినేనని నిమ్మల స్పష్టంచేశారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యాపేటలో ఆయన కార్మికులతో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల షెల్టర్‌ నిర్మాణ పనులు చేశారు. సొంత నిధులతో ఆ విగ్రహాలకు షెల్టర్‌ నిర్మిస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు చేపట్టిన పనులను మంగళవారం ఆయన పరిశీలించిన కార్మికులతో కలిసి పనులు చేశారు.

Updated Date - Jun 19 , 2024 | 04:16 AM