CM Chandrababu: ఏపీకి భారీగా పెట్టుబడులు.. యూత్‌కు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ABN , Publish Date - Nov 11 , 2024 | 08:31 PM
టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా దేశాభివృద్ధిలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో సైతం కీలకంగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబుతో ఆ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగాలతోపాటు వివిధ కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, చంద్రశేఖరన్ చర్చించారు.
అమరావతి, నవంబర్ 11: విశాఖపట్నంలో నూతన ఐటీ సెంటర్ ఏర్పాటు ద్వారా 10 వేల ఉద్యోగాలు కల్పించేందుకు టాటా గ్రూపు కృతనిశ్చయంతో ఉందని టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడితో టాటా కంపెనీల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కొన్ని కీలక రంగాల్లో పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం చంద్రబాబు.. తన ఎక్స్ ఖాతా వేదికగా తెలిపారు.
Also Read: AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్
ఏపీలో పరిశ్రమలు, టూరిజం అభివృద్ది కోసం 20 హోటళ్ల (తాజ్, వివంతా, గేట్ వే, సెలక్షన్స్, జింజర్ ) కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టే అంశంపై చర్చించినట్లు చెప్పారు. అలాగే వాయు, సౌర విద్యుత్‌లో 5 గెగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్రాజక్టుల కోసం దాదాపు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులపైనా సైతం చర్చించామన్నారు. అదే విధంగా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ప్రాధమిక ఆరోగ్య రంగంలో వినియోగానికి సంబంధించిన అంశాన్ని సైతం ప్రస్తావించినట్లు వివరించారు.
Also Read: ఆర్కే రోజాకు మంత్రి సవిత చురకలు
భారతదేశాభివృద్ధిలో రతన్ టాటా తన మార్క్ వదిలి వెళ్లారని ప్రశంసించారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఎంతో దోహద పడ్డారని ఈ సందర్భంగా రతన్ టాటా సేవలను సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దేశాభివృద్ధిలోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక భాగస్వామ్యముందని చెప్పారు.
Also Read: పులివెందుల పౌరుషం ఉంటే.. రా చూసుకుందాం
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్త కావాలన్న కల నెరవేరడంపై కూడా ఈ సమావేశంలో మాట్లాడుకున్నామని పేర్కొన్నారు. అయితే నేడు జరిగిన సమావేశం.. ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఓ చుక్కానిలా పని చేస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
అక్టోబర్ 9 వ తేదీన ముంబయిలోని బ్రిచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా మరణించిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ సంస్థలు.. రాష్ట్రంలో పలు సేవ కార్యక్రమాల్లో తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్న విషయం విదితమే.
Also Read: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ
రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో సంక్షేమంపై పెట్టిన శ్రద్ద.. అభివృద్ధితోపాటు యువతకు ఉపాది కల్పనపై పెట్టలేదు. దీంతో రాష్ట్రానికి చెందిన యువత ఉద్యోగ ఉపాది కోసం.. పక్క రాష్ట్రాలకు వలస బాట పట్టింది. అంతేకాదు.. గత ఐదేళ్లలో ఒక్క సంస్థ కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాలేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఉన్న సంస్థలు సైతం పక్క రాష్ట్రానికి తరలిపోయాయి. ఇక ఎన్నికల సమయం రానే వచ్చింది.
ఈ ఎన్నికల్లో కూటమికి ఆంధ్ర ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రాష్ట్రంలో మళ్లీ పరిశ్రమలు ఏర్పాటు ఊపందుకుంది. అలాగే యువతకు ఉపాధితోపాటు ఉద్యోగ కల్పనపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. అందులోభాగంగా గతంలో వెళ్లిపోయిన లూలు కంపెనీ సైతం విశాఖ, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. అదే విధంగా టాటా గ్రూప్ సంస్థలతోపాటు వివిధ ప్రముఖ కంపెనీలు సైతం ఏపీలోని వివిధ ప్రాంతాల్లో స్థాపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి.
For AndhraPradesh News And Telugu News