Share News

Chandrababu: ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు.. పోలీసులకు క్లాస్

ABN , Publish Date - Jun 06 , 2024 | 09:08 PM

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తన పార్టీ ఎంపీలతో కలసి గురువారం సాయంత్రం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Chandrababu: ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు.. పోలీసులకు క్లాస్
TDP Chief Nara ChandraBabu Naidu

అమరావతి, జూన్ 06: ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తన పార్టీ ఎంపీలతో కలసి గురువారం సాయంత్రం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే గత ప్రభుత్వ హయాంలో.. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లుతుంటే.. రహదారినిపై ప్రజలు, వాహనాదారులను పోలీసులు గంటల తరబడి నిలబేట్టే వారు. ఈ నేపథ్యంలో ఆ తరహా చర్యలకు స్వస్తి పలకాలని పోలీసులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

ఆ క్రమంలో కరకట్టతోపాటు తన కాన్వాయ్‌ వెళ్తున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆపవద్దని భద్రతా సిబ్బందికి చంద్రబాబు సూచించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే రహదారిలో గంటల తరబడి వాహనాలు నిలిపేవేసే విధానాలకు పోలీసులు ఇకపై స్వస్తి పలకాలన్నారు. తక్షణమే సంబంధింత అధికారులకు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని తన సీఎస్ఓను చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఉండవల్లి నివాసం నుండి చంద్రబాబు ఎయిర్ పోర్టుకు వెళ్లే లోపులో గుంటూరు ఎస్పీ, విజయవాడ సీపీలకు చంద్రబాబు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు.


కాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడే.. అతి తక్కువ సమయంలో మాత్రమే పౌరుల వాహనాలు నియంత్రించి వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలన్న చంద్రబాబు సూచనను.. సీఎస్‌వో ఉన్నతాధికారులకు వివరించారు. భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలకు, వాహన దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని పోలీసులకు చంద్రబాబు సూచించారు.

భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తన రాకపోకలు ఉండేలా చూడాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి తీవ్ర చర్యలకు ఇకపై స్వస్థి చెప్పాలని ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2024 | 09:09 PM