Pttabhi: తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా బుకాయిస్తారా?
ABN , Publish Date - Mar 18 , 2024 | 04:19 PM
Andhrapradesh: గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసిందన్నారు. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా బుకాయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, మార్చి 18: గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని గౌతమ్ సవాంగ్ (APPSC
Chairman Gautham Sawang) బుకాయించటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (TDP Leader Kommareddy Pattabhiram) మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసిందన్నారు. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా బుకాయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కాంపై తామిచ్చిన ఆధారాలు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలతో వస్తానని.. మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. తప్పు చేసి కూడా ఇంకా బుకాయించటం ఏంటి అని నిలదీశారు. ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్‌గా కొనసాగే అర్హత సవాంగ్‌కు లేదన్నారు.
రాష్ట్ర డీజీపీగా బాధ్యతాయుతమైన పదవి నిర్వర్తించిన సవాంగ్ ఈ విధంగా బుకాయించటం దిగజారుడుతనానికి పరాకాష్ట అని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తొలగించముందే సవాంగ్ రాజీనామా చేస్తే గౌరవ ప్రదంగా ఉంటుందని సూచించారు. నేడు జరుగుతున్న ఏపీపీఎస్సీ పరీక్షలు సవాంగ్ చైర్మన్‌గా పారదర్శకంగా నిర్వహిస్తారని ఎలా నమ్మాలని అడిగారు. నిన్న జరిగిన ప్రిలిమ్స్ వాల్యూయేషన్‌లో అవకతలు జరగవని గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్ర యువత జీవితాలతో ఆడుకున్న ఎవరినీ వదలిపెట్టమని కొమ్మారెడ్డి పట్టాభి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
Election Commission: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ సంచలన నిర్ణయం
Shivraj Singh Chouhan: ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా.. రాహుల్‌పై మాజీ సీఎం ఫైర్..!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...