Share News

టీడీపీలో చల్లబడ్డ రాజ్యసభ ఆశావహులు

ABN , Publish Date - Dec 08 , 2024 | 04:34 AM

రాజ్యసభ సీట్లను ఆశిస్తూ పలు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలు తాజా పరిణామాలతో చల్లబడ్డారు.

టీడీపీలో చల్లబడ్డ రాజ్యసభ ఆశావహులు

  • అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయన్న సంకేతాలిస్తున్న చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సీట్లను ఆశిస్తూ పలు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలు తాజా పరిణామాలతో చల్లబడ్డారు. పార్టీ కి సంబంధించి అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారయ్యాయని అధినేత చంద్రబాబు సంకేతాలు ఇస్తుండటంతో ప్రయత్నాలు విరమించుకొన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్ల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ అయింది. వీటికి నామినేషన్ల దాఖలుకు 10వ తేదీ చివరి రోజు. బీదా మస్తాన్‌ రావును టీడీపీ, ఆర్‌. కృష్ణయ్యను బీజేపీ నిలబెడుతున్నట్లు సమాచారం. మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన స్థానంలో కాకినాడ జిల్లాకు చెందినసానా సతీశ్‌ను నిలపాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది.

Updated Date - Dec 08 , 2024 | 04:34 AM