Share News

YSRCP's Vijayasai Reddy : చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు..

ABN , Publish Date - Dec 11 , 2024 | 06:16 AM

ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రపదజాలంతో అగౌరవపరచిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై...

YSRCP's Vijayasai Reddy : చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు..

  • విజయసాయిరెడ్డిపై అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు

అనకాపల్లి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రపదజాలంతో అగౌరవపరచిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై మంగళవారం అనకాపల్లి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పటికి చంద్రబాబు బతికి ఉంటే అరెస్టు చేసి జైలులో పెడతామని విజయసాయిరెడ్డి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బవులవాడకు చెందిన టీడీపీ నాయకుడు గుడాల సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఐ నాగేశ్వరరావుకు ఫిర్యాదు అందజేశారు.

Updated Date - Dec 11 , 2024 | 06:16 AM