Kesineni Chinni: ఆర్కే రోజాకు ఎంపీ కేశినేని చిన్ని వార్నింగ్
ABN , Publish Date - Oct 21 , 2024 | 08:25 PM
అదృశ్యమైన 30 మంది మహిళలకు గుర్తించి.. వారిని స్వస్థలాలకు తీసుకు వచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చూట్టింది. విశాఖపట్నంలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా అప్పగించిన వందల కోట్ల విలువైన 15 ఎకరాల భూమి కేటాయింపును సైతం రద్దు చేసింది. ఈ తరహా అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ.. ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ కో తట్టుకో లేకపోతుంది.
విజయవాడ, అక్టోబర్ 21: కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలుంతా కీర్తిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా లాంటి వాళ్లు ఓర్వలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక సీటుకి పరిమితం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Also Read: Bihar: డీజీపీకి చేతులు జోడించి.. అభ్యర్థించిన సీఎం
ఇంకా సిగ్గు రాలేదా?
రాష్ట్ర ఓటర్లు ఈ విధంగా తీర్పు ఇచ్చినా.. మీకు ఇంకా సిగ్గు రాలేదా? అంటూ ఆర్కే రోజాను ఆయన నిలదీశారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఈ సందర్భంగా ఆర్కే రోజాను ఎంపీ చిన్ని హెచ్చరించారు. లేకుంటే ఈ సారి ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారన్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తారని ఎంపీ చిన్ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీలో పెద్దలను కలిసి నిధులు తెస్తున్నారని ఈ సందర్భంగా ఎంపి చిన్ని గుర్తు చేశారు.
Also Read: NSTR: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు..
గత ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి రవాణాను ప్రోత్సహించి యువత జీవితాలను బలి చేశారని నిప్పులు చెరిగారు. ఇటీవల జరిగిన దారుణాలకు ఈ గంజాయి మత్తే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. నిందితులను తాము వెంటనే అరెస్టు చేశామని చెప్పారు.
Also Read: Konaseema: కోనసీమ జిల్లాలో పాస్టర్ ఘరానా మోసం
మీ జమానాలో ఎంత మందిని అరెస్ట్ చేశారు...
అయితే జగన్ జమానాలో జరిగిన దారుణాలకు ఎంత మందిని అరెస్టు చేశారంటూ వైసీపీ నేతలను ఈ సందర్బంగా ఎంపీ కేశినేని చిన్ని సూటిగా ప్రశ్నించారు. గత ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఎంపీ కేశినేని నాని గుర్తు చేశారు. ఆవేమీ వైసీపీ నేతలకు పట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వారి ఆచూకీ తెలుసుకుని వెనక్కి తీసుకు వస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వివరించారు.
Also Read: Pawan Kalyan: ఉత్తరాంధ్రలో బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కూటమి ప్రభుత్వ రావడంతో.. వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటరు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. అయితే గత జగన్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరుపుతుంది. అందులోభాగంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ నటి జత్వానీ కేసు విషయంలో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడింది.
Also Read: Telangana MLA: తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
అలాగే అదృశ్యమైన 30 మంది మహిళలకు గుర్తించి.. వారిని స్వస్థలాలకు తీసుకు వచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చూట్టింది. విశాఖపట్నంలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా అప్పగించిన వందల కోట్ల విలువైన 15 ఎకరాల భూమి కేటాయింపును సైతం రద్దు చేసింది. ఈ తరహా అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ.. ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ కో తట్టుకో లేకపోతుంది.
Also Read: సీమ చింతకాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఆ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఓ విధమైన ఆరోపణలు గుప్పిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ విధానాలను సైతం వైసీపీ అగ్రనేతలు తప్పుపడుతున్నారు. చివరకు విజయవాడ నగరాన్ని వరదలు ముంచేస్తే.. దానిని సైతం వైసీపీ రాజకీయం చేసింది. అలాంటి వేళ.. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కూటమిలోని పార్టీల నేతలు ఘాటుగా విమర్శలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో వైఎస్ జగన్, ఆర్కే రోజాపై విజయవాడ ఎంపీ కేశినేని నాని నిప్పులు చెరిగారు.
For AndhraPradesh News and Telugu News..