బీసీలకు చంద్రబాబు పెద్దపీట: బుద్దా
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:20 AM
టీడీపీతోనే బీసీలకు మేలు జరుగుతుందని మరోసారి రుజువైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
విజయవాడ(వన్‌టౌన్), డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): టీడీపీతోనే బీసీలకు మేలు జరుగుతుందని మరోసారి రుజువైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ హయాంలో సీఎస్ నుంచి కానిస్టేబుల్ దాకా ఒకే సామాజికవర్గం ఉంటే ఇప్పుడు డీజీపీ, సీఎస్ తదితర కీలక పోస్టుల్లో ఉన్నవారంతా బీసీలేనన్నారు. సీఎ్‌సగా బీసీని నియమించటంతో టీడీపీతోనే బీసీలకు మేలు జరుగుతుందని స్పష్టమైందని తెలిపారు.