Home » Buddha Venkanna
టీడీపీతోనే బీసీలకు మేలు జరుగుతుందని మరోసారి రుజువైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అకారణంగా వైసీపీ కుక్కలు తిడితే నోరు మెదపని పేర్ని నాని.. నేడు తప్పు చేసి దొరికిపోయి..
Buddha Venkanna: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా నాని ఉన్నప్పుడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్పై అసభ్యకరమైన సినిమా తీయడానికి నీతో చర్చ చేసింది వాస్తవమా కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానీని ఉరి తీయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల బియ్యాన్ని నాని పందికొక్కులా తిన్నారని, ఆయన్ని వెంటనే ఊరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు మాత్రం మరోలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: నూజివీడులో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని.. నీచంగా దూషణలు చేసి... చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అంటూ మండిపడ్డారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి, నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందన్నారు.
అసెంబ్లీకి హాజరుకాని 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు జీతాలు తీసుకుంటున్నారు కానీ, ప్రజల తరఫున మాట్లాడేందుకు మాత్రం రావడం లేదన్నారు. దీంతో పాటు జగన్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘అవంతి శ్రీనివాస్... నీలాంటి ఊసరవెల్లులు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
వైఎస్పార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యదు చేసినట్లు తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. విజయసాయికి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని అన్నారు.