Share News

‘కుడా’ చైర్మన్‌గా సోమిశెట్టి ప్రమాణం

ABN , Publish Date - Nov 26 , 2024 | 05:05 AM

కర్నూలు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (కుడా) చైర్మన్‌గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

‘కుడా’ చైర్మన్‌గా సోమిశెట్టి ప్రమాణం

కర్నూలు అర్బన్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (కుడా) చైర్మన్‌గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో సోమిశెట్టి చేత మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రమాణం చేయించారు. సోమిశెట్టి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆశీస్సులతోనే 25 ఏళ్ల పాటు టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగానని, గ్రూపు రాజకీయాలు, వర్గపోరుకు ఆస్కారం లేకుండా ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 05:05 AM