Share News

The goal is welfare: సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Sep 26 , 2024 | 10:59 PM

గ్రామాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే కర్తవ్య మని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్‌ భూపే ష్‌రెడ్డి అన్నారు. భీమగుండం, బోడితిప్పలపల్లె గ్రామాల్లో గురువారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ .....

The goal is welfare: సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
భీమగుండంలో నీటి ట్యాంకుకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్‌ భూపేష్‌రెడ్డి

TDP.gif

అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం

‘ఇది మంచి ప్రభుత్వం’లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్‌ రెడ్డి

ఇంటింటా కరపత్రాల పంపిణీ

పెద్దముడియం, సెప్టెంబరు 26: గ్రామాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే కర్తవ్య మని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్‌ భూపే ష్‌రెడ్డి అన్నారు. భీమగుండం, బోడితిప్పలపల్లె గ్రామాల్లో గురువారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం పీడ విరగడైందని ప్రస్తు తం ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని సంక్షే మ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీమగుండంలో రూ.40 లక్షలు వెచ్చించి మంచినీటి ట్యాంకు ఏర్పాటుకు భూమిపూజ చేశారు. రూ.17లక్షలతో సిమెంటు రోడ్ల పనులు ప్రారంభించారు. వంద రోజుల పాలనలో భాగంగా ప్రజలకిచ్చిన సూపర్‌సిక్స్‌ హమీల్లో రూ.4వేలు వృద్ధాప్య పింఛన్లు, ల్యాండ్‌ టైట్లింగ్‌యాక్ట్‌ రద్దు తదితర కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టారన్నారు. అన్న క్యాంటిన్లు ప్రారంభించడం, త్వరలో మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తామన్నా రు. భీమగుండం, నొస్సం, ఎ.కంబాలదిన్నె గ్రామాల తారురో డ్లుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. భీమగుండం పరిధిలో సోలార్‌ పవర్‌పాయింట్లు రాబోతున్నాయని తద్వా రా సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 1600 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.


06-BDL-RURAL-26........-.gifబద్వేలు గాంధీనగర్‌లో కరపత్రాలు పంచి ప్రజలకు వివరిస్తున్న తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు మాచుపల్లె లక్ష్మిదేవి

ఎస్‌ఆర్‌బీసీ కాల్వ గుండా త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కుందూ నుంచి భీమగుండం, భూతమాపురం గ్రామాలకు సంబంధించి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం అవుతాయన్నారు. జమ్మలమడుగులో తరచూ వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని, జాబ్‌ మేళాలు నిర్వహి స్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొత్తమ్మీద ఈ వంద రోజులపాలనలో ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రజలకు వారు వివరించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కొండారెడ్డి, ఎంపీడీఓ వెంకటరమణయ్య, తహసీల్దారు వెంకటసుబ్బయ్య, రూరల్‌ సీఐ వేణుగోపాలరెడ్డి, ఆయా గ్రామాల నేతలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

బద్వేలు గాంధీనగర్‌లో....

బద్వేలు రూరల్‌, సెప్టెంబరు 26: సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని తెలుగు మహిళా నియో జకవర్గ అధ్యక్షురాలు మాచుపల్లె లక్ష్మిదేవి అన్నారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ సమన్వయకర్త రితీష్‌ రెడ్డి సూచనతో గురువారం 21, 22 వార్డులు గాంధీనగర్‌లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్ల వద్దకు వెళ్లి వంద రోజుల్లో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను కరపత్రాలు అందించి ప్రజలకు వివరించారు. శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, పెద్ద పక్కీరయ్య, తుంగా నరసింహ, చిన్నపక్కీరయ్య, సచివాలయ సిబ్బంది, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.


26bkd1.b.-kodur.gifబి.కోడూరు సభలో మాట్లాడుతున్న టీడీపీ నేత రితీష్‌కుమార్‌రెడ్డి

పోరుమామిళ్లలో కరపత్రాల పంపిణీ

పోరుమామిళ్ల, సెప్టెంబరు 26: పోరుమామిళ్లలోని 59వ పోలింగ్‌ బూత్‌ కన్వీనరు అన్వర్‌బాషా, అధికారులు ఇంటిం టికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆర్యవైశ్యవీధిలో మౌళా లి, రంతుల్లా తదితరులు కరపత్రాలను పంపిణీ చేశారు. పోరుమామిళ్ల సచివాలయ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, వీఆ ర్వో వెంకటసుబ్బమ్మ, హెల్త్‌ అసిస్టెంటు సిద్దు, ఇంజనీరింగ్‌ అసిస్టెంటు ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తంబళ్లగొందిలో...

అట్లూరు, సెప్టెంబరు 26: తంబళ్లగొంది పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’లో భాగంగా ఇంటింటికీ కరపత్రాలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోతిరెడ్డి రెడ్డప్పరెడ్డి కేవీ సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, మహేశ్వర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ సుజాతమ్మ, పంచాయతీ అధికారి శివప్రసాద్‌, ఏపీయం సురేశ్‌బాబు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సమస్యలకు పరిష్కారం చూపండి

బి.కోడూరు, సెప్టెంబరు 26: ప్రతి గ్రామానికీ అధికారులు వెళ్లి ఎలాంటి సమస్యలున్నా వాటిని గుర్తించి పరిష్కరించా లని బద్వేలు నేత రితీష్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నియోజకవర్గం నేత బొజ్జా రోశన్న సూచించారు. ఎంపీడీఓ భాస్కర్‌రావు అధ్యక్షతన ‘ఇది మంచి ప్రభుత్వం’లో ఆయన మాట్లాడు తూ మండల రైతాంగానికి బ్రహ్మంసాగర్‌ నుంచి త్వరలో సాగు, తాగునీరు అందిస్తామని, అన్నిచెరువులు పూర్తిగా నీటితో నింపుతామన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు రామ చంద్రారెడ్డి, గోడి రమణారెడ్డి, శేషారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, బాలయ్య, మద్దిరెడ్డి, వేణగోపాలరెడ్డి, రాఘవరెడ్డి, దుగ్గి రెడ్డి, జయరామిరెడ్డి, పవన్‌, నరసింహులు పాల్గొన్నారు.


ఖాజీపేటలో...

ఖాజీపేట, సెప్టెంబరు 26: వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని మరచిపోయిందని ఖాజీపేట ఎంపీటీసీ బి.చంద్రభాస్కర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఖాజీపేట, మిడుతూరు, తుడుమలదిన్నె పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ నిర్వహించారు. ఖాజీపేట వక్కిలేరు కాల్వను పునరుద్ధరించి రైతాంగానికి సాగునీరు, ఖాజీపేట ప్రజలకు తాగునీరు తీర్చిన వ్యక్తి ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌ అన్నారు. ఖాజీపేట పంచాయతీలో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు అనుమతి వచ్చాయన్నారు. ఎంపీడీఓ వెంకటరమణ, ఈఓపీఆర్‌డీ వెంకటసుబ్బారెడ్డి, సెక్రటరి రమణారెడ్డి, టీడీపీ నేతలు సిద్దారం కదీరుల్లా, కేకే బ్రదర్స్‌, జాఫర్‌, ఖలీల్‌, తదితరులు పాల్గొన్నారు.

దిరసవంచలో...

బ్రహ్మంగారిమఠం, సెప్టెంబరు 26: ప్రజాసంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని బ్రహ్మంగారిమఠం మండల టీడీపీ అధ్యక్షు డు చెన్నుపల్లి సుబ్బారెడ్డి అన్నారు. దిరసవంచ పంచా య తీలో నిర్వహించిన ‘ఇదిమంచి ప్రభుత్వం’లో ఆయన మా ట్లాడుతూ మఠాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిది ద్దేందుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, సర్పంచ్‌ రాళ్లపా టి అమీర్‌బాషా, వెలుగు ఏపీఎం ప్రకాశరావు, టీడీపీ నేతలు సుబ్బారెడ్డి, భాస్కర్‌, సుధాకర్‌, సాంబశివారెడ్డి, శివాయాదవ్‌, ముద్దు క్రిష్ణమనాయుడు, భగీరధ, వెంకటేశ్‌, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ముద్దనూరులో...

ముద్దనూరు సెప్టెంబరు26: సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో ప్రజలకు ప్రభుత్వం పింఛన్‌ పెంపు వంటి పథకాలు అందించిందన్నారు. కార్యక్రమంలో సచివాలయ వీఆర్‌ఓ సునీత, ఈశ్వరరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 11:01 PM