Anitha: ఫేస్ బుక్ లేదు అంటే ఆశ్చర్య పోతున్నారు
ABN , Publish Date - Aug 10 , 2024 | 08:56 AM
విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నేడు నగర పోలీసులు మారథాన్ నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్తాన్ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు.
అమరావతి: విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నేడు నగర పోలీసులు మారథాన్ నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్తాన్ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది సైబర్ కమాండోలు, 2000 మందికి సైబర్ సోల్జర్స్ శిక్షణ ఇచ్చి నగర పోలీసులు నియమించారు. కార్యక్రమంలో ఎమ్మల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అని మాట్లాడుతూ.. ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
టెక్నాలజీ పెరిగిన తరువాత నేరాలు పెరిగాయన్నారు. టెక్నాలజీ వల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని అనిత పేర్కొన్నారు. దేశంలో 1700 కోట్లు 4 నెలల్లో సైబర్ నేరాల వల్ల పోగొట్టుకున్నారని తెలిపారు. చదువుకున్న వాళ్ళే సైబర్ నేరాలకు బలి అవుతున్నారన్నారు. ఫేస్ బుక్ లేదు అంటే ఆశ్చర్య పోతున్నారన్నారు. ఒక్క క్లిక్ తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. చిన్న చిన్న పిల్లలు సైబర్ నేరాలకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. 50 లక్షల లోన్ ఇస్తానని తనకు కూడా మెసేజ్ చేశారన్నారు. లోన్ యాప్స్ వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
సైబర్ నేరానికి గురైన బి టెక్ స్టూడెంట్ తన దగ్గరకు వచ్చిందని.. ఆ తరువాత సూసైడ్ చేసుకుందని అనిత చెప్పారు. సైబర్ సెల్ ప్రతి జిల్లాలో ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అన్ నోన్ క్లిక్స్ ద్వారా మన ఫ్యూచర్ ని మనమే నాశనం చేసుకుంటున్నామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా సైబర్ నేరగాళ్లకు బలైన వాళ్ళేనని హోంమంత్రి అనిత అన్నారు. స్టేట్ సైబర్ సెల్ కో ఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామన్నారు. మన భవిష్యత్ మన చేతిలో ఉందని.. కేస్ పెడతా అని బెదిరించగానే.. అసలు ఎందుకు తమపై కేస్ పెడుతున్నారు అని ప్రశ్నించడం లేదని వంగలపూడి అనిత అన్నారు.