Tirumala: తిరుమలలోనూ ఇకపై హెల్మెట్ తప్పనిసరి..
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:40 PM
తిరుమల(Tirumala)లోనూ ఇకపై ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్(Helmet) వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులు(Traffic officers) నిర్ణయించారు. ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే కొన్నేళ్లుగా తిరుమల మొదటి, రెండో ఘాట్‌లో హెల్మెట్ తప్పనిసరి నిబంధన కొనసాగుతున్న విషయం తెలిసిందే.
- అమలుపై అధికారుల కసరత్తు
తిరుమల: తిరుమల(Tirumala)లోనూ ఇకపై ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్(Helmet) వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులు(Traffic officers) నిర్ణయించారు. ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే కొన్నేళ్లుగా తిరుమల మొదటి, రెండో ఘాట్‌లో హెల్మెట్ తప్పనిసరి నిబంధన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా, తిరుమలలో తిరిగే ద్విచక్రవాహనదారులకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Tirupati: అమ్మో.. పులి.. వేద వర్సిటీలో భయాందోళన
ఇందులో భాగంగానే మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భక్తులు, స్థానికులు, వ్యాపారులు, ఉద్యోగులకు హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలని సూచించారు. ఇక, అతి తక్కువ పరిధిలో ఉండే తిరుమలలో ద్విచక్రవాహనాలపై వేగంగా వెళ్లే అవకాశం ఉండదు. అలాంటప్పుడు తిరుమల(Tirumala)లో హెల్మెట్ నిబంధన అవసరమా అనే చర్చ మొదలైంది. అయితే ద్విచక్రవాహనదారుల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఈ నూతన నిర్ణయాన్ని అమలుచేయాలనే ఆలోచన చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు
ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో
ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న
Read Latest Telangana News and National News