Tirupati: తిరుమలలో అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలి
ABN , Publish Date - Dec 13 , 2024 | 11:36 AM
తిరుమల(Tirumala) మాడవీధుల విస్తరణలో భాగంగా కూల్చివేసిన అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని, లేనిపక్షంలో ఫిబ్రవరి 22న ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని మంగళం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి స్పష్టం చేశారు.
- విజయశంకర్‌స్వామి -
తిరుపతి: తిరుమల(Tirumala) మాడవీధుల విస్తరణలో భాగంగా కూల్చివేసిన అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని, లేనిపక్షంలో ఫిబ్రవరి 22న ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని మంగళం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి స్పష్టం చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని, తొలగించిన హనుమంతుడి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించాలని కోరుతూ పుణ్యక్షేత్రాలు తిరిగి భక్తుల సంతకాలు సేకరించి టీటీడీ(TTD)కి సమర్పించామన్నారు.
అన్నమయ్య గృహ సాధన సమితి, జై భారత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ డిమాండ్లపై పోరాడుతున్నామన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిత్య హరినామ సంకీర్తన జరగాలని, అప్పుడే పూర్తిస్థాయిలో తిరుమల పుణ్యక్షేత్రం ప్రక్షాళన అవుతుందన్నారు. భక్తి గీతాలు నేర్పించే గురువులకు టీటీడీ గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసియోధ లోకనాథ్, ఖదిజ్ఞాసి మల్లికావల్లభ, ఖధిజ్ఞాసి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News