Tirupati: మీ సర్వేయరే నా స్థలం కబ్జా చేశాడు..
ABN , Publish Date - Nov 05 , 2024 | 01:46 PM
‘మీ దగ్గర పనిచేసే సర్వేయరే నా స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టేసుకున్నాడు. తహసీల్దారు(Tehsildar) కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడంలేదు. మీరైనా సర్వే చేయించి న్యాయం చేయండి’ అంటూ ఆర్డీవో రామ్మోహన్(RDO Rammohan) ముందు ఓ బాధితుడు ఆవేదన చెందారు.
- గ్రీవెన్స్‌లో ఆర్డీవో వద్ద బాధితుడి ఆవేదన
తిరుపతి: ‘మీ దగ్గర పనిచేసే సర్వేయరే నా స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టేసుకున్నాడు. తహసీల్దారు(Tehsildar) కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడంలేదు. మీరైనా సర్వే చేయించి న్యాయం చేయండి’ అంటూ ఆర్డీవో రామ్మోహన్(RDO Rammohan) ముందు ఓ బాధితుడు ఆవేదన చెందారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో రూరల్ మండలం అవిలాల గ్రామానికి చెందిన వి.సుబ్బన్న వినతి పత్రం అందజేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Anitha: డీఎస్పీల శిక్షణలో మహిళల ప్రతిభ ఎంతో గర్వకారణం
డాక్యుమెంట్లు పరిశీలించిన ఆర్డీవో ఇప్పటి ఈసీ తీసుకొస్తే జిల్లా సర్వే ఇన్‌స్పెక్టర్(Survey Inspector)తో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా బాధితుడు సుబ్బన్న ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘అవిలాల గ్రామ లెక్కదాఖలా సర్వే నెంబరు 28/3లో 10 సెంట్లు, 28/4లో 0.39 సెంట్లు, 28/2లో 27 సెంట్లు స్థలం అనువంశికంగా మా స్వయార్జితం. 28/3లో చిట్టిబాబు అనే సర్వేయర్‌కు 30 అంకణాల భాగం విక్రయించాను.
ఆ స్థలాన్ని వేరేవాళ్లకు విక్రయించేసి, 28/4లో నేను నిలుపుకొన్న స్థలాన్ని ఆక్రమించి 40 అంకణాలకు పైగా ఇల్లు నిర్మించుకున్నాడు. సదరు స్థలాలను సర్వే చేయడానికి రూరల్ తహసీల్దారు(Tehsildar)ను పలుసార్లు కోరినా సర్వేయర్లు ముందుకు రావడంలేదు. సర్వే నివేదిక ఇవ్వడంలేదు. అతడు సర్వేయర్ కావడంతో ఇతర సర్వేయర్లు నాకు సహకరించడంలేదు.
గత వారం గ్రీవెన్స్‌కి వచ్చినప్పుడు తనపై దాడి చేస్తున్నానని నాపై సర్వేయర్ చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆర్డీవోను కలవనీయకుండా చేశారు. జిల్లా సర్వేయర్ ద్వారా 28/3, 28/4 నెంబర్లకు సర్వే జరిపి మాకు హద్దులు చూపించాలని కోరుతున్నా’ అని విజ్ఞప్తి చేశారు. దీనిపై చిట్టిబాబును వివరణ కోరగా తాను కొనుగోలు చేసిన స్థలంలోనే ఇల్లు నిర్మించుకున్నానని చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: మినరల్ కాదు.. జనరల్ వాటరే
ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్ అంటూ మోసం: హరీశ్‌రావు
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్, హరీశ్ ఇళ్ల ముందు ధర్నా చేయండి
ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు
Read Latest Telangana News and National News