Siddham Meeting: మరికాసేపట్లో వైసీపీ చివరి సిద్ధం సభ.. దుమ్మెత్తిపోస్తున్న జనం
ABN , Publish Date - Mar 10 , 2024 | 01:43 PM
ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలతో ప్రజలకు మాత్రం పాట్లు తప్పడం లేదు. ఈరోజు బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు చేశారు. అయితే దీని వల్ల ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు చుద్దాం.
ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ (YSRCP) నిర్వహిస్తున్న సిద్ధం సభలతో ప్రజలకు మాత్రం పాట్లు తప్పడం లేదు. ఇప్పటికే పలు చోట్ల ఈ సభలు నిర్వహించగా పెద్దగా ప్రజల నుంచి స్పందన రాలేదు. అయినా ఈ రోజు బాపట్ల (bapatla) జిల్లాలోని మేదరమెట్లలో (Medarametla) చివరి సిద్ధం సభకు (siddham meeting) ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సభ కోసం ప్రజలను తరలించేందుకు అనేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా డిపోలలో బస్సులు లేక ప్రయాణీకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు(busses) సిద్దం సభకి కేటాయించారని తెలుసుకున్న ప్రజలు జగన్ సర్కారు, సిద్ధం సభపై దుమ్మెత్తిపోస్తున్నారు.
మరోవైపు ఈ సభ కోసమే ఏకంగా 4,500 మంది పోలీసులను కేటాయించారు. దీంతో అనేక పోలీస్ స్టేషన్లలో పోలీసులు కనిపించడం లేదు. అయితే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ లేదా క్రైం జరిగితే ఎవరికి చెప్పుకోవాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మొత్తం పోలీసులను సభ కోసమే వాడితే ఎలా అని వైసీపీని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఈ మేదరమెట్ల సభకు లక్ష మందికి కూడా ఏర్పాట్లు చేయకుండా 15 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు(ycp leaders) ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు సభా ప్రాంగణంలో వైసీపీ నేతలు VFX గ్రీన్ మ్యాట్ చేర్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రాఫిక్స్‌లో ప్రజలు ఎక్కువగా వచ్చారని నీలి మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు ఇలా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.
16వ నెంబరు జాతీయ రహదారి పక్కనే సిద్దం సభ ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అవస్థలు ఎదురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో అధికార వైసీపీ సిద్ధం సభల పేరుతో ఇలా ప్రజలను(people) ఇబ్బంది పెట్టడం సరికాదని అంటున్నారు. దీంతో అనేక చోట్ల అధికార పార్టీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: AP News: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై తొలిసారి స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల