Share News

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు..

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:29 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా 12వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12వ తేదీ తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు..

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా 12వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12వ తేదీ తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే అన్ని వాహనాలు రాకపోకలను కత్తిపూడి జాతీయ రహదారి 216 మీదుగా మళ్లించనున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల రాకపోకలను గామన్ బ్రిడ్జి-దేవరపల్లి-జంగారెడ్డిగూడెం -ఖమ్మం మీదుగా దారి మళ్ళించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాల్ని నున్న- వెలగలేరు -జి కొండూరు- మైలవరం - హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు వైపును మళ్లించనున్నారు.

Updated Date - Jun 10 , 2024 | 09:29 AM