Minister Ramprasad Reddy: ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగాలి
ABN , Publish Date - Dec 04 , 2024 | 04:25 AM
‘‘ప్రయాణికుల సంతృప్తే మనకు ముఖ్యం. వారి నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తోంది? పరిష్కరించాల్సిన సిబ్బంది సమస్యలు ఏమున్నాయి?
సమీక్షలో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి ఆదేశం
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రయాణికుల సంతృప్తే మనకు ముఖ్యం. వారి నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తోంది? పరిష్కరించాల్సిన సిబ్బంది సమస్యలు ఏమున్నాయి? ఆదాయం పెంచుకోవడానికి టిక్కెట్టేతర మార్గాలేంటి? కొత్త బస్సులు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది?’’ అంటూ రవాణా మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి ఆర్టీసీ అధికారులపైప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెంచాలి. వీలైనంత త్వరగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలి.. ఆదాయం పెంచుకోవడానికి ప్రయాణ చార్జీలు కాకుండా బీవోటీపై దృష్టి సారించాలి. విలీన సమస్యలపై ఇప్పటికీ అసోసియేషన్ల ప్రతినిధులు వినతులు ఇస్తున్నారు.. వాటిలో మీ పరిధిలో ఉన్నవి పరిష్కరించండి.. ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తా’ అని మంగళవారంనాటి సమీక్షలో పేర్కొన్నారు.