Bandi Sanjay: ఐదేళ్లుగా వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన
ABN , Publish Date - Jul 11 , 2024 | 10:44 AM
తిరుమల శ్రీవారిని ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. స్వామివారి దయా బిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానన్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారిని ఇవాళ కేంద్ర మంత్రి బండి (Bandi Sanjay) సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. స్వామివారి దయా బిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానన్నారు. గత ఐదేళ్లలో స్వామి వారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకొని.. స్వామి వారికీ.. టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారన్నారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని బండి సంజయ్ తెలిపారు.
ఇతర మతస్థులకు అధికారం అప్పగించి.. తిరుమలని అపవిత్రం చేశారని.. అక్రమ దందాలకు పాల్పడ్డారని బండి సంజయ్ విమర్శించారు. ఎర్రచందనాన్ని కొల్లగొట్టి.. వేల కోట్లను సంపాదించారని విమర్శించారు. ఐదేళ్లుగా టీటీడీ పాలన వీరప్పన్ వారసుల చేతిలో సాగిందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఎర్రచందనాన్ని కొలగొట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని బండి సంజయ్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి బిగ్ షాట్, మరో 9 మంది నేతలు కూడా..!
AP Cabinet: అలా వచ్చి.. ఇలా వాలిపోతున్నారు!
Read Latest AP News And Telugu News