Share News

Breaking News: దూసుకొస్తున్న కమల హారీస్.. ట్రంప్‌కు చెమటలు పట్టిస్తున్న మహిళ

ABN , First Publish Date - Nov 05 , 2024 | 04:40 PM

US Election Results 2024 LIVE Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు మీకు ఆంధ్రజ్యోతి అందిస్తోంది.

  Breaking News: దూసుకొస్తున్న కమల హారీస్.. ట్రంప్‌కు చెమటలు పట్టిస్తున్న మహిళ
Breaking News

Live News & Update

  • 2024-11-06T07:37:48+05:30

    దూసుకొస్తున్న కమల హారీస్

    • 219 స్థానాల్లో వెలువడుతున్న లీడ్స్

    • గెలుపు కోసం 270 స్థానాల్లో విజయం తప్పనిసరి

    • ఇప్పటివరకు 120 స్థానాల్లో ట్రంప్ పార్టీ లీడ్

    • 99 స్థానాల్లో కమలా హారీస్ లీడ్

  • 2024-11-06T07:34:08+05:30

    ఏ రాష్ట్రంలో ఏ పార్టీ లీడ్..

    రాష్ట్రం

    లీడ్‌లో ఉన్న పార్టీ

    అధ్యక్ష అభ్యర్థి

    అలబామా

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    కేన్సస్

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    ఓక్లహోమా

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    టెక్సస్

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    మిస్సోరీ

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    మిస్సిసిప్పీ

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    ఇండియానా

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    కెంటకి

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    టెన్నిసీ

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    జార్జియా

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    ఫ్లోరిడా

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    సౌత్ కెరోలినా

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    వెస్ట్ వర్జినీయా

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    నార్త్ డకోటా

    రిపబ్లికన్

    డొనాల్డ్ ట్రంప్

    ఒహాయో

    డెమోక్రటిక్

    కమల హారీస్

    పెన్సిల్వేనియా

    డెమోక్రటిక్

    కమల హారీస్

    మిషిగన్

    డెమోక్రటిక్

    కమల హారీస్

    వర్జినీయా

    డెమోక్రటిక్

    కమల హారీస్

    నార్త్ కెరోలినా

    డెమోక్రటిక్

    కమల హారీస్

  • 2024-11-06T07:11:15+05:30

    గెలుపు దిశగా ట్రంప్

    • కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్

    • గెలుపు దిశగా రిపబ్లికన్ పార్టీ

    • 153 స్థానాల్లో వెలువడుతున్న లీడ్స్

    • గెలుపు కోసం 270 స్థానాల్లో విజయం తప్పనిసరి

    • ఇప్పటివరకు 101 స్థానాల్లో ట్రంప్ పార్టీ లీడ్

    • 52 స్థానాల్లో కమలా హారీస్ లీడ్

    • 13 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ లీడ్

    • ఐదు రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ లీడ్

    • అలబామా, కేన్సస్, ఓక్లహోమా, టెక్సస్, మిస్సోరీ, మిస్సిసిప్పీ,

    • ఇండియానా, కెంటకి, టెన్నిసీ, జార్జియా, ఫ్లోరిడా,

    • సౌత్ కెరోలినా, వెస్ట్ వర్జినీయా, నార్త్ డకోటా రాష్ట్రాల్లో ట్రంప్ పార్టీ లీడ్

    • ఒహాయో, పెన్సిల్వేనియా, మిషిగన్, వర్జినీయా, నార్త్ కెరోలినా రాష్ట్రాల్లో హారీస్ పార్టీ లీడ్

  • 2024-11-06T05:45:00+05:30

    • ఓట్ల కౌంటింగ్‌ మొదలు.. ముందంజలో డొనాల్డ్ ట్రంప్

    • అమెరికాలో మొదలైన ఓట్ల కౌంటింగ్

    • ఇండియానా, కెంటకీ రాష్ట్రాల్లో ముందంజలో ట్రంప్

    • ఇండియానాలో ఇప్పటివరకూ 6 శాతం ఓట్ల గణన

    • వీటిల్లో ట్రంప్‌కు 63.1 శాతం, కమలా హారిస్‌కు 35.8 శాతం

    • కెంటకీలో మూడు శాతం ఓట్ల గణన,

    • ఇక్కడ లెక్కించిన ఓట్లలో ట్రంప్ 66.8 శాతం, కమలా హారిస్‌కు 32.1 శాతం ఓట్లు

  • 2024-11-06T05:15:00+05:30

    • ఫిలడెల్ఫియాలో చీటింగ్ జరిగిందంటూ ట్రంప్ ఆరోపణ

    • భారీగా చీటింగ్ జరిగిందని తన సోషల్ మీడియా ట్రూత్‌ సోషల్‌లో ఆరోపణ

    • ట్రంప్‌ ఆరోపణలపై స్పందించిన స్తానిక అధికారులు

    • ట్రంప్ ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్న వైనం

  • 2024-11-06T03:30:00+05:30

    • ఐయోవాలో మొరాయించిన ఓటింగ్ యంత్రాలు

    • స్టోరీ కౌంటీ, ఏమ్స్ నగరంలో పనిచేయని ఓటింగ్ యంత్రాలు

    • సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్న రాష్ట్ర సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ప్రతినిధి

    • పౌరులు ఓటు వేసేందుకు ఎటువంటి ఇబ్బందీ లేదని వెల్లడి

    • ఫలితాల వెల్లడిలోనే జాప్యం జరిగే అవకాశం ఉందని వివరణ

    • బ్యాలెట్ పేపర్లు చేతితో లెక్కించాల్సి రావడంతో జాప్యం జరగొచ్చని వెల్లడి

  • 2024-11-06T01:30:00+05:30

    • మిచిగన్ పోలింగ్ సెంటర్‌లో గ్యాస్ లీక్

    • గ్యాస్ లీక్ కారణంగా నార్త్‌విల్‌లోని ఓ పోలింగ్ కేంద్రం మూసివేత

    • ఓటర్లను సమీపంలోని మరో కేంద్రానికి పంపిన వైనం

  • 2024-11-06T01:15:00+05:30

    • అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్‌లోకి దూసుకొచ్చేందుకు వ్యక్తి యత్నం

    • క్యాపిటల్ విజిటర్ సెంటర్ వద్ద తనిఖీల సందర్భంగా ఘటన

    • ఆగంతుకుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది

    • నిందితుడి నుంచి ఫ్లేర్ గన్, ఇంధనం స్వాధీనం

    • క్యాపిటల్‌లో పర్యాటకులను వెనక్కు పంపించేసిన సిబ్బంది

    • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన భద్రతా అధికారులు

  • 2024-11-06T00:45:00+05:30

    • పోలింగ్ అనంతరం ట్రంప్ ‘ఎలక్షన్ నైట్’

    • తన ప్రైవేట్ క్లబ్ మార్-ఏ-లాగోలో ఎలక్షన్ నైట్ వేడుక ఏర్పాటు

    • ట్రంప్‌తో పాటూ పాల్గొననున్న టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్

    • ఎన్నికల ఫలితాల విడుదలను ట్రంప్‌తో కలిసి వీక్షించనున్న వైనం

  • 2024-11-06T00:15:00+05:30

    • ఈసారి హింసాత్మక ఘటనలకు తావుండదన్న ట్రంప్

    • తన విజయంపై ధీమా వ్యక్తం చేసిన మాజీ అధ్యక్షుడు

    • తన మద్దతుదారులు హింసకు పాల్పడే వ్యక్తులు కాదని వ్యాఖ్య

    • ఇదే తన చివరి ఎన్నికల ప్రచారమని స్పష్టీకరణ

    • ఫలితాల అనంతరం తాము భారీ విజయోత్సవం జరుపుకోనున్నట్టు జోస్యం

  • 2024-11-05T23:15:00+05:30

    • పెన్సిల్వేనియాలోని కాంబ్రియా కౌంటీలో పోలింగ్ సమయం పొడిగింపు

    • సాఫ్ట్‌వేర్ సమస్యతో పోలింగ్‌కు అంతరాయం

    • మొరాయించిన బాలెట్ పేపర్ స్కానింగ్ యంత్రాలు,

    • ఓటు వేయకుండానే వెనుదిరిగిన పలువురు ఓటర్లు

    • ఓటింగ్ సమయం పెంపునకు కోర్టును ఆశ్రయించిన అధికారులు

    • రెండు గంటల పాటు సమయం పొడిగించేందుకు జడ్జి అనుమతి

  • 2024-11-05T22:52:00+05:30

    • ఫ్లోరిడాలో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రంప్

    • పామ్ బీచ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటేసిన డోనాల్డ్ ట్రంప్, మెలానియా దంపతులు

    • కన్జర్వేటివ్‌లు పెద్ద సంఖ్యలో ఓటేస్తున్నారని మీడియాతో ట్రంప్ వ్యాఖ్య

  • 2024-11-05T22:30:00+05:30

    • జార్జియా రాష్ట్రంలో బాంబు బెదిరింపులతో కలకలం

    • ఫుల్టన్ కౌంటీలోని రెండు బూత్‌లల్లో బాంబు ఉందంటూ వార్నింగ్స్

    • ఆయా కేంద్రాలను తాత్కాలికంగా ఖాళీచేయించిన అధికారులు

    • మొత్తం ఐదు చోట్ల బాంబులు ఉన్నట్టు బెదిరింపులు వచ్చాయన్న స్థానిక అధికారి

    • తనిఖీల అనంతరం అవన్నీ ఫేక్ అని తేలినట్టు వెల్లడి

    • రష్యా నుంచి బెదిరింపులు వచ్చినట్టు పేర్కొన్న సెక్రెటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్‌స్పెర్జర్

  • 2024-11-05T21:49:41+05:30

    • ఎవరు గెలిచినా రికార్డే

    • అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రే

    • 2020 తర్వాత మరోసారి గెలిస్తే ట్రంప్ రికార్డ్

    • లేదంటే అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం ముగిసినట్టే

    • కమలా హారిస్ విజయం సాధిస్తే చరిత్ర సృష్టించినట్టే

    • తొలి నల్లజాతీయ మహిళగా రికార్డ్

    • పశ్చిమ ఆసియా మహిళగా చరిత్ర

  • 2024-11-05T21:39:51+05:30

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    • అమెరికా ఎన్నికలపై తప్పుడు ప్రచారం

    • ఫేక్ వీడియోలు షేర్ చేసిన యువకులు

    • యూత్‌కు వార్నింగ్ ఇచ్చిన ఎఫ్‌బీఐ

  • 2024-11-05T21:34:58+05:30

    • అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    • అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్న

    • సునీతా విలియమ్స్

  • 2024-11-05T21:33:15+05:30

    • అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    • ఒహియోలో ఓటు వేసిన

      ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్

  • 2024-11-05T21:30:10+05:30

    • ఓటర్లకు ట్రంప్ విజ్ఞప్తి

    • అమెరికా చరిత్రలో ముఖ్యమైన రోజు

    • క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేయండి

    • ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్

  • 2024-11-05T20:26:03+05:30

    ఓటర్లకు కమలా హారిస్ విజప్తి

    ‘ఎన్నికల రోజే వచ్చేసింది. ఈ రోజు మనం దేశాన్ని ప్రేమిస్తున్నాం. అమెరికా వాగ్దానాన్ని విశ్వసించి ఓటు వేస్తున్నాం. మీరంతా మీ వాణి వినిపించి ఓటు వేయండి అని’ కమలా హారిస్ రిక్వెస్ట్ చేశారు.

  • 2024-11-05T19:08:00+05:30

    • కమలా హారిస్ గెలవాలని బ్యానర్లు

    • ఆలయం వెలుపల కమలా హ్యారిస్ గెలువాలని బ్యానర్

    • ఆలయానికి విరాళాలు అందజేసిన వారిలో కమలా హారిస్, తాత పేరు

    • కమలా హారిస్ గెలువాలని ఆలయంలో బుధవారం అన్నదానం

    • హారిస్ ఉపాధ్యక్షురాలిగా గెలిచిన సమయంలో బాణాసంచా కాల్చి, అన్నదానం

  • 2024-11-05T19:06:18+05:30

    • కమలా హారిస్ స్వగ్రామంలో పూజలు

    • డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ స్వగ్రామంలో పూజలు

    • అధ్యక్ష పదవి చేపట్టాలని తమిళనాడులో గల తులసేంద్రపురంలో పూజలు

  • 2024-11-05T17:07:15+05:30

    అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అప్‌డేట్స్

    • సాయంత్రం 5.30 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యే కేంద్రాలు ఇవే

    • అలబామ

    • డెలావేర్

    • వాషింగ్టన్ డీసీ

    • ఫ్లోరిడా

    • జార్జియా

    • ఇల్లినోయిస్

    • కాన్సాస్

    • మేరీలాండ్

    • మసాచుసెట్స్

    • మిచిగాన్

    • మిస్సోరి

    • పెన్సిల్వేనియా

    • రోడ్ ఐలాండ్

    • సౌత్ కరోలినా

    • టెన్నెస్సీ

  • 2024-11-05T17:03:27+05:30

    అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అప్‌డేట్స్

    • సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యే కేంద్రాలు ఇవే

    • ఒహియో

    • నార్త్ కరోలినా

    • వెస్ట్ వర్జీనియా

    • వెర్మాంట్

  • 2024-11-05T17:01:06+05:30

    • అమెరికా అధ్యక్ష ఎన్నికల అప్‌డేట్స్

    • అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు

    • కౌంటింగ్ ముగిసిన తర్వాత, ప్రజాదరణ పొందిన ఓట్ల విజేత ప్రకటన

    • అమెరికాలో అధ్యక్షుడు ప్రజల ఓట్లతో కాకుండా ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నిక

    • ఖచ్చితమైన ఫలితాలు పొందేందుకు కొన్నిసార్లు ఒకటి లేదా రెండు రోజులు సమయం

    • డిసెంబరులో ఓటర్ల ఓటింగ్ తర్వాత, అన్ని ఎలక్టోరల్ సర్టిఫికేట్లు డిసెంబర్ 25 నాటికి సెనేట్ అధ్యక్షుడికి అందుతాయి

    • జనవరి 6, 2025న కాంగ్రెస్ ఉమ్మడి సెషన్‌లో ఎలక్లర్ల ఓట్లను లెక్కిస్తారు

    • ఆ రోజున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజేత పేరు ప్రకటిస్తారు

  • 2024-11-05T16:55:42+05:30

    • అమెరికా అధ్యక్ష ఎన్నికల అప్‌డేట్స్

    • చాలా ఓటింగ్ కేంద్రాలు సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం

    • అమెరికాలో ఓటింగ్ ముగిసే సమయానికి ఇండియాలో మరుసటి రోజు ప్రారంభం

    • బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు అమెరికాలో ఓటింగ్ ముగిసే అవకాశం

    • అమెరికా రాష్ట్రాలు అనేక విభిన్న సమయ మండలాలుగా విభజించబడినందున ఎక్కువగా సమయం

    kamala--trump-new.jpg

  • 2024-11-05T16:53:29+05:30

    • అమెరికాలో అధ్యక్ష ఎన్నికకు ఓటింగ్

    • అధ్యక్ష బరిలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్

    • అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ప్రారంభం

    • భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:30 వరకు పోలింగ్

  • 2024-11-05T16:45:08+05:30

    అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం

    • భారత కాలమానం ప్రకారం 4.30 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యేది ఇక్కడే

    • ఇండియానా

    • మైనే

    • న్యూ హంప్‌షైర్

    • న్యూజెర్సీ

    • న్యూయార్క్

    • వర్జినీయా

    • కనెటికట్

    • కెంటుకీ

  • 2024-11-05T16:40:09+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

  • 2024-11-05T08:37:08+05:30

    • అమెరికా ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ కీ రోల్

    • ఫలితంపై ప్రభావం చూపనున్న 7 రాష్ట్రాలు

    • పెన్సిల్వేనియో, నార్త్ కరోలినా, జార్జియా, మిచిగాన్, అరిజోనా, విస్కాన్సిన్, నెవాడాలో 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు

    • అమెరికా అధ్యక్ష ఎన్నికను ప్రభావం చేయనున్న 7 రాష్ట్రాలు

    • ప్రచారం చివరలో కూడా ట్రంప్- హారిస్ ఇక్కడే క్యాంప్