Share News

AP Politics: జగన్ ఆలోచన వల్ల దివాళా తీసిన ఏపీ: వసంత కృష్ణ ప్రసాద్

ABN , Publish Date - Apr 01 , 2024 | 10:06 PM

సీఎం జగన్( CM Jagan) ఆలోచన వల్ల ఏపీ దివాళా తీసిందని మైలవరం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. మైలవరం చలవాది కళ్యాణ మండపంలో శంఖరావం కార్యక్రమంపై సోమవరాం నాడు తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) హాజరయ్యారు.

AP Politics: జగన్ ఆలోచన వల్ల దివాళా తీసిన ఏపీ: వసంత కృష్ణ ప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా - మైలవరం: సీఎం జగన్( CM Jagan) ఆలోచన వల్ల ఏపీ దివాళా తీసిందని మైలవరం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. మైలవరం చలవాది కళ్యాణ మండపంలో శంఖరావం కార్యక్రమంపై సోమవరాం నాడు తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) హాజరయ్యారు. సమీక్ష సమావేశానికి మైలవరం,జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. వైసీపీపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, యువనేత లోకేష్ ని తిట్టినవారికే సీఎం జగన్మోహన్ రెడ్డి సీటు ఇస్తానని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని అన్నారు.

TDP: పెన్షన్ల అంశం.. సీఎస్‌తో టీడీపీ నేతల బృందం భేటీ

2024లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలవడం అత్యంత అవసరమని తెలిపారు. 2018 నుంచి 24 వరకు మైలవరం నియోజకవర్గం అభివృద్ధి కోసమే పనిచేశానని చెప్పారు. గెలిచిన దగ్గర నుంచి తాను సీఎంను నియోజకవర్గం అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను అడిగానని చెప్పారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావించాయన్నారు. ముఖ్యమంత్రి తనను పిలిచి సంవత్సరం నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నావని, మళ్లీ తననే మైలవరంలో పోటీ చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత అన్ని చూసుకుంటా అన్నారని చెప్పారు. అభివృద్ధికి నిధులు ఇవ్వనప్పుడు తాను ఎందుకు వైసీపీ నుంచి పోటీ చేయాలని జగన్‌ని ప్రశ్నించానని అన్నారు.


ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీలో చేరానని చెప్పారు. ఎమ్మెల్యే సీటును తాను అడగలేదని, లోకేష్, చంద్రబాబు చెబితేనే మైలవరంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్నానని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి చంద్రబాబు నిధులు ఇస్తానంటేనే టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. ఐదేళ్లలో పోలవరం ఐదు శాతం పనులు చేయలేదన్నారు. గడప గడప కు వెళ్తే మా బిడ్డల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారన్నారు. ఎంబీఏ, ఇంజినీరింగ్ చదివారని తమ బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించారన్నారు. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు సీఎం కావాలని చెప్పారు. చింతలపూడి పూర్తి చేయాలంటే నిధులు కావాలని.. నిధులు ఇచ్చే శక్తీ చంద్రబాబుకే ఉందన్నారు.

YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం

వారు నిత్యం బాధపడుతున్నారు: కేశినేని చిన్ని

తమ పార్టీ కుటుంబ సభ్యులను వదిలి వెళ్లిన కొద్దిమంది నేతలు ప్రతి నిత్యం బాధడుతూ ఉంటారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. జూన్ 5వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలను గెలిపించి చంద్రబాబుకి కానుకగా ఇద్దామని తెలిపారు.

టీడీపీ చేసింది చెప్పుకోలేక గత ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. ఈ 42 రోజులు మనం చేసింది, చేయబోయేది ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. రెండు సార్లు టీడీపీ ఎంపీ పదవి ఇచ్చి ఆదరించారని చెప్పారు. తమ కుటుంబంలోని కొంతమంది వ్యక్తుల్లాగా చంద్రబాబుని ఇబ్బంది కలిగించే విధంగా తాను వ్యవహరించనని కేశినేని చిన్ని తెలిపారు.

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్డేట్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 10:21 PM