Share News

AP Police: వేగంగా వెళ్తున్న కారుపై పోలీసులకు డౌట్.. చేజ్ చేసి చెక్ చేయగా షాక్..

ABN , Publish Date - Nov 07 , 2024 | 09:52 AM

Andhrapradesh: అనకాపల్లి జిల్లాలో సినీ పక్కిలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు వెంబడించారు. స్మగ్లర్లు కారులో గంజాయిని తరలించేందుకు యత్నించారు. కారును చూసిన చెక్‌పోస్టు సిబ్బంది దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు చెక్ పోస్ట్‌ను కారుతో గుద్ది మరీ తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును చేజింగ్ చేశారు.

AP Police: వేగంగా వెళ్తున్న కారుపై పోలీసులకు డౌట్.. చేజ్ చేసి చెక్ చేయగా షాక్..
AP Police

అనకాపల్లి, నవంబర్ 7: సినిమాల్లో దొంగలను పట్టుకునే విధానాన్ని డైరెక్టర్లు వెరైటీగా చూపిస్తుంటారు. పోలీసులకు చిక్కకుండా దొంగలు, స్మగ్లర్ల ప్రయత్నాలు మామూలుగా ఉండదు. నగదు, బంగారం, గంజాయి, డ్రగ్స్‌ వంటి వాటిని తరలించే సమయంలో వారు చేసే ఫైట్లు, పోలీసులకు చిక్కకుండా వారి ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుల చేజింగ్‌ కూడా ఓరేంజ్‌లో చూపిస్తుంటారు డైరెక్టర్లు. ఎలాగైనా సరే చివరకు పోలీసులకు దుండగులు, స్మగ్లర్లు చిక్కాల్సిందే. అయితే రీల్ లైఫ్‌ వేరు.. రియల్ లైఫ్ వేరు. కొందరు రియల్ స్మగ్లర్లు సినిమా స్టైల్లో తమ సరుకు పోలీసులకు చిక్కకుండా రవాణా చేసేందుకు నానా రకాలుగా తంటాలు పడుతుంటారు. ఇలాంటి ఘటనే అనకాపల్లిలో జిల్లాలో చోటు చేసుకుంది.

IT Rides: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు


కొందరు స్మగ్లర్లు గంజాయిని తరలించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. అనుకున్న విధంగా కారులో గంజాయిని తరలిస్తున్నారు. అయితే చెక్‌పోస్టు వద్ద పోలీసులను చూసిన స్మగ్లర్లు కంగారుపడిపోయారు. ఏదైతే అదే అనుకున్నారో ఏమో ఆ స్మగ్లర్లు బరతెగించారు. పోలీసుల కళ్లకు చిక్కకుండా ఉండేందుకు చెక్‌పోస్టును కారుతో గుద్దిమరీ పరారయ్యారు. పోలీసులు కూడా వెనక్కి తగ్గేదే అంటూ సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్ల వెంటపడ్డారు.


అనకాపల్లి జిల్లాలో సినీ పక్కిలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు వెంబడించారు. స్మగ్లర్లు కారులో గంజాయిని తరలించేందుకు యత్నించారు. కారును చూసిన చెక్‌పోస్టు సిబ్బంది దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు చెక్ పోస్ట్‌ను కారుతో గుద్ది మరీ తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును చేజింగ్ చేశారు. అల్లూరి జిల్లా నుంచి దేవరాపల్లి మీదగా కారు వస్తున్నట్లు తెలుసుకున్న చెక్‌పోస్టు సిబ్బంది.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఒకవైపు నుంచి పోలీసులు, మరో వైపు నుంచి చెక్ పోస్ట్ సిబ్బంది కారు కోసం చేజింగ్ చేశారు. అయితే ఇక్కడే స్మగ్లర్లను దురదృష్టం వెంటాడింది.


పోలీసుల నుంచి తప్పించుకునే సమయంలో కారు టైర్ పంచరైంది. గత్యంతరం లేని పరిస్థితిలో టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న డ్రైనేజీలోకి కారును తీసుకెళ్లారు. చివరకు కారును అక్కడే వదిలి స్మగ్లర్లు పరారయ్యారు. వెంటనే కారు వద్దకు వచ్చిన పోలీసులు తనిఖీలు చేయగా.. 40 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారును ఆపేందుకు నాలుగు రోడ్ల జంక్షన్‌లో ట్రాక్టర్ అడ్డగా పెట్టడంతో కారు నిలిపివేసి అందులో ఉన్న వ్యక్తులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


జిల్లాలోని దేవరాపల్లిలో కొత్త చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. కేవలం గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకే పోలీసులు ఈ విధమైన చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్మగ్లర్లు 40 కేజీల గంజాయితో వెళ్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడ చెక్‌పోస్టు సిబ్బంది అప్రమత్తమై కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్మగ్లర్లు స్పీడ్‌ను తగ్గించకుండా చెక్‌పోస్టును గుద్దుకుంటూ వెళ్లిపోయారు. దీంతో స్థానిక పోలీసుల సహాయంతో చెక్‌పోస్టు సిబ్బంది చేజింగ్ చేసి కారును పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: ఈ రైల్వే గార్డుకు సలాం కొట్టాల్సిందే.. తల్లిదండ్రులను పిల్లలతో ఎలా కలిపాడో చూడండి..

WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 10:56 AM