Share News

Atchannaidu: ఓ దళిత బిడ్డ పట్ల సీఎం అమానుషంగా వ్యవహరించారు..

ABN , Publish Date - Feb 08 , 2024 | 02:00 PM

అమరావతి: కోడి కత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రావటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత బిడ్డ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని..

Atchannaidu: ఓ దళిత బిడ్డ పట్ల సీఎం అమానుషంగా వ్యవహరించారు..

అమరావతి: కోడి కత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రావటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత బిడ్డ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని, కోడి కత్తి కేసు ద్వారా జగన్ అబద్దాలతో లబ్ది పొంది సీఎం అయ్యారని విమర్శించారు. శ్రీనుకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వటాన్ని తెలుగుదేశం స్వాగతిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు.

కాగా ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీను ఐదేళ్లుగా జైలులో మగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శ్రీను కుటుంబసభ్యులు అనేకమార్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జైలులోనే దీక్ష చేశాడు. ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు జైలులోని అతనికి చికిత్సను అందించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు సైతం నిరాహార దీక్ష చేశారు. న్యాయం కోసం ఎంతగానో పోరాడారు. మొత్తానికి కోడికత్తి శ్రీనుకు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది.

Updated Date - Feb 08 , 2024 | 02:00 PM