Share News

Gangavaram Port: విధుల్లో చేరిన గంగవరం పోర్ట్ ఉద్యోగులు

ABN , Publish Date - May 17 , 2024 | 11:58 AM

విశాఖ: గంగవరం పోర్ట్ కార్మికుల ఉద్యమం కొలిక్కి వచ్చింది. శుక్రవారం నుంచి విధుల్లోకి చేరారు. రేపటి నుంచి ప్రోడక్షన్‌ దిశగా విశాఖ ఉక్కు కర్మాగారం పని చేయనుంది. ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ దిశగా గంగవరం పోర్ట్ కార్మికులు అడుగులు వేస్తున్నారు. గత 41 రోజులు, ఇప్పుడు 20 రోజులుగా చేస్తున్న ఉద్యమనికి ఉద్యోగులు స్వస్తి పలికారు.

Gangavaram Port: విధుల్లో చేరిన గంగవరం పోర్ట్ ఉద్యోగులు

విశాఖ: గంగవరం పోర్ట్ (Gangavaram Port) కార్మికుల ఉద్యమం కొలిక్కి వచ్చింది. శుక్రవారం నుంచి విధుల్లోకి చేరారు. రేపటి నుంచి ప్రోడక్షన్‌ (Production) దిశగా విశాఖ ఉక్కు కర్మాగారం (Visakha Steel Plant) పని చేయనుంది. ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ (One time settlement) దిశగా గంగవరం పోర్ట్ కార్మికులు అడుగులు వేస్తున్నారు. గత 41 రోజులు, ఇప్పుడు 20 రోజులుగా చేస్తున్న ఉద్యమనికి ఉద్యోగులు స్వస్తి పలికారు.


విశాఖ ఉక్కు (Visakha Steel) ఊపిరి పీల్చుకుంది... గంగవరం పోర్టు మీద ఆధారపడిన స్టీల్ ఫ్లాంట్ ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ఉత్పత్తి నిలిపివేసింది. ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. కోకింగ్ కోల్‌ బ్యాటరీస్‌ను నార్మల్ టెంపరేచర్‌తో మెంటైన్ చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే పరిశ్రమ మూతపడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. ఇటువంటి పరిస్థితిలో గంగవరం కార్మికులు సమ్మె విరమించడంతో ఒక వైపు వారికి లాభమైతే.. మరోవైపు స్టీల్ ప్లాంట్‌కు ప్రయోజనం చేకూరనుంది. ఉత్పత్తికి కావాల్సిన సుమారు 60 వేల టన్నుల కోకింగ్ కోల్‌‌ను ప్రస్తుతం అదానీ పోర్టులో ఉంది. దీన్ని స్టీల్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. కార్మికులు మొదట్లో పెట్టిన డిమాండ్లను తగ్గించుకుని ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కోసమే విధులకు హాజరవుతున్నామని కార్మికులు తెలిపారు.


కాగా సంక్షోభంలో విశాఖ ఉక్కు..

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. అదానీ గంగవరం పోర్టులో ఏప్రిల్‌ 12న నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె నెల రోజులకు పైగా కొనసాగుతోంది. దీని ఫలితంగా స్టీల్‌ ప్లాంటుకు పోర్టు నుంచి బొగ్గు, లైమ్‌స్టోన్‌ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడెక్కడి నుంచో రూ.600 కోట్ల అప్పులు తెచ్చి ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుంచి స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం కోకింగ్‌ కోల్‌ తెప్పించుకుంటే అది పోర్టులో చిక్కుకు పోయింది. స్టీల్‌ప్లాంటుకు నష్టం జరగకుండా బొగ్గు పంపాలనుకుంటే అదానీకి నిమిషాలపై పని. కానీ కార్మికుల సమ్మెను సాకుగా చూపించి ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం వల్ల చర్చలు కూడా సవ్యంగా నిర్వహించడం లేదు. స్టీల్‌ అధికారుల సంఘం హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చినా వాటినీ పట్టించుకోవడం లేదు. సమస్యను దీర్ఘకాలంపాటు సాగదీసి విశాఖ స్టీల్‌ప్లాంటును నష్టాల్లో ముంచేయడానికి అన్ని శక్తులూ తెర వెనుక నుంచి పనిచేస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ సమక్షంలో చర్చలు నిర్వహించాలని కార్మికులు కోరుతుంటే...దానికి పోర్టు యాజమాన్యం చొరవ చూపడం లేదు. ఎన్నికల విధుల్లో ఉన్నందున కలెక్టర్‌, కమిషనర్‌ ఈ సమస్యను పట్టించుకోలేదంటే కొంతవరకు ఉక్కు కార్మిక సంఘాలు విశ్వసించాయి. ఇప్పుడు అన్ని రకాల పని ఒత్తిళ్లు తగ్గిపోయినా జిల్లా అధికారులు ప్లాంటు సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


భారీగా పడిపోయిన ఉత్పత్తి

స్టీల్‌ప్లాంటులో నెలకు రూ.2,500 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయి. రోజుకు సగటున 20 వేల టన్నుల స్టీల్‌ తయారుచేస్తారు. బొగ్గు, ఇతర ముడిపదార్థాలు అందుబాటులో లేకపోవడం వల్ల గత ఏప్రిల్‌ నెలలో రూ.1,250 కోట్ల విలువైన స్టీల్‌నే తయారుచేశారు. వివిధ వర్గాల నుంచి రూ.800 కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకోవడంతో వారంతా 70 శాతానికి పైగా ఉత్పత్తులు తీసుకుపోయారు. స్టీల్‌ నిల్వలు కూడా పడిపోయాయి. మే నెలకు వచ్చేసరికి ఉత్పత్తి మరీ తగ్గిపోయింది. ఈ నెల 14వ తేదీ నాటికి 70 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. వాస్తవానికి వేయి కోట్ల రూపాయలకుపైగా విలువైన ఉత్పత్తులు తయారు చేయాల్సి ఉండగా కేవలం రూ.370 కోట్ల విలువైన ఉత్పత్తులే తయారయ్యాయి. అదానీ పోర్టు కారణంగా స్టీల్‌ప్లాంటుకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి బాధ్యత వహిస్తూ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా...అది తనకు వర్తించదంటూ ‘మెజ్యూర్‌’ నోటీసు జారీచేసింది. ప్రకృతి కారణంగా జరిగే నష్టాలకు వర్తించే ‘మెజ్యూర్‌’ను ఈ సమ్మెకు ఆపాదిస్తూ తాము నష్ట పరిహారం ఇవ్వబోమని అదానీ పోర్టు మొండికేసింది.


జీతాలు లేవు...విద్యుత్‌ బిల్లులు లేవు

సరైన ఉత్పత్తి, అమ్మకాలు లేకపోవడంతో ఏప్రిల్‌ నెల జీతాలు ఇప్పటివరకు స్టీల్‌ప్లాంటు ఇవ్వలేకపోయింది. ఉద్యోగులు, కార్మికులు అందరికీ కలిపి నెలకు రూ.84 కోట్ల వరకు జీతాలుగా ఇవ్వాల్సి ఉంది. గత నెలలో కూడా చేతిలో నగదు నిల్వలు లేకపోవడంతో రెండు వాయిదాల్లో జీతాలు చెల్లించింది. ఈ నెల 15వ తేదీ వచ్చినా రూపాయి కూడా ఉద్యోగులకు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే విద్యుత్‌ బిల్లుల భారం పెరిగిపోయింది. మార్చి నెలకు సంబంధించిన బిల్లు, డిమాండ్‌ చార్జీలు కలిపి రూ.68.43 కోట్లు బకాయి ఉందని, రెండు రోజుల్లో చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ నోటీసు జారీ చేసింది. తక్షణమే కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ కల్పించుకొని కార్మికులతో చర్చలు ఏర్పాటు చేసి, స్టీల్‌ప్లాంటుకు బొగ్గు, లైమ్‌స్టోన్‌ అందించే దిశగా చర్యలు చేపట్టాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు

పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్

బయటపడిన జగన్ నిజస్వరూం..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..

‘ఇండీ’ కూటమికి ప్రధాని సవాల్‌

అయ్యో.. ‘అమ్మ’..!

వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోలు బాంబులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 17 , 2024 | 12:05 PM