Share News

Vangalapudi Anitha: సింహాచలం అప్పన్నను కుటుంబస సమేతంగా దర్శించుకున్న హోంమంత్రి అనిత

ABN , Publish Date - Aug 18 , 2024 | 11:48 AM

ఆంధ్రప్రదేశ్ హోంశాఖా మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ వంగలపూడి అనిత కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 1040 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు.

Vangalapudi Anitha: సింహాచలం అప్పన్నను కుటుంబస సమేతంగా దర్శించుకున్న హోంమంత్రి అనిత

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ హోంశాఖా మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ వంగలపూడి అనిత కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 1040 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో ఉన్న దేవతామూర్తులను దర్శించుకుంటూ భక్తులతో ఆమె మాట్లాడారు.


పలువురు భక్తులు హోమంత్రితో సెల్ఫీలు తీసుకున్నారు. భక్తులను పలకరిస్తూ అనిత ఉత్సాహంగా కొండకు చేరుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు.


దర్శనంపై హోంమంత్రి అనిత ఏమన్నారంటే..

మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని హోమంత్రి వంగలపూడి అనిత అన్నారు. లక్షలాది మంది భక్తులు నడిచి వచ్చే మెట్ల మార్గాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విచారం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొత్త మెట్లు మార్గాన్ని చైర్మన్ అశోక్ గజపతిరాజు మొదలుపెట్టారని, అయితే వైసీపీ ప్రభుత్వం దాన్ని మధ్యలోనే నిలిపివేసిందని అన్నారు.


భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈవోకి తాను చెప్పానని అనిత వెల్లడించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై ఉండాలని భగవంతుని ప్రార్థించానని ఆమె చెప్పారు.

Updated Date - Aug 18 , 2024 | 12:01 PM