AP News: కూతురి కోసం తండ్రి ఆత్మహత్య.. న్యాయం కోసం గ్రామస్తుల పోరాటం
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:44 PM
Andhrapradesh: విశాఖపట్నంలో కన్న కూతురి కాపురం బాగోలేదని తండ్రి ఆత్మహత్య చేసుకు ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తమకు న్యాయం కావాలంటూ మృతదేహంతో గ్రామస్తులు, బంధువులు ఆందోళనకు దిగారు.
విశాఖపట్నం, డిసెంబర్ 27: అన్ని బంధాలలో తండ్రీ, కూతుళ్ల బంధం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కూతురు ఉన్న తండ్రి ఎంతో అదృష్టవంతుడని అంటారు. కన్న కూతురిని తన తల్లిలా చూసుకుంటూ ఎంతో ప్రేమను పంచుతాడు తండ్రి. తండ్రీకూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పుకున్న తక్కువా. కూతురి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు తండ్రి. ఆమెకు కష్టం వస్తే అస్సలు తట్టుకోలేడు. కూతురిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడుతుంటాడు. అలాగే కూతురి వివాహం కోసం ఎంతో ఆరాటపడుతుంటారు. కూతురిని గొప్పగా చూసుకునే భర్త రావాలని కోరుకుంటాడు. అత్తవారింట్లో కూతురు సుఖపడాలనే తన తాహాతకు మించి కట్నకానుకలు సమర్పిస్తుంటారు. కానీ ఎంతో అపురూపంగా చూసుకున్న తమ బిడ్డ అత్తారింటిల్లో కష్టాలు పడితే మాత్రం ఆ తండ్రి గుండె తట్టుకోదు. ఆ బిడ్డ కష్టాలను తీర్చేందుకు తన వంతుగా సమాయం చేస్తుంటాడు. కన్న కూతురిని కట్టుకున్న భర్త, అత్తమామలే వేధింపులకు గురిచేస్తే ఆ తండ్రి బాధ వర్ణణాతీతం. విశాఖలో ఇలాంటి ఘటననే చోటు చేసుకుంది. కూతురి కాపురం బాగోలేదని ఆ తండ్రి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
విశాఖపట్నం తగరపువలస టి.నగరంపాలెంకు చెందిన బొట్ట శ్రీనివాసరావు (52) ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురు యామిని కాపురం బాగోలేదంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆ తండ్రి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో శ్రీనివాస్‌కు న్యాయం జరగాలంటూ గ్రామస్తులంతా ఏకమయ్యారు. టి.నగరంపాలెంలో రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అందరిలాగే బొట్ట శ్రీనివాస రావు కూడా తన కూతురు యామినికి మంచి సంబంధం అని భావించి భారీగా కట్నకానుకలు సమర్పించి పెళ్లి చేశాడు. అయితే పెళ్లి అయినప్పటి నుంచి కూతురికి అత్తగారింట్లో వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. అత్తవారింటి వేధింపులకు యామిని ప్రతీరోజూ నరకం అనుభవిస్తూనే ఉంది. సమస్యల నడుమే యామినికి కొడుకు పుట్టాడు.
Anagani: అది పిచ్చి తుగ్లక్ జగన్‌కే చెల్లుతుంది..
అయినప్పటికీ అత్తంటివారి వేధింపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కూతురి కాపురాన్ని నిలబెట్టాలని తండ్రి బొట్ట శ్రీనివాసరావు ఎన్ని సార్లు ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. దీంతో యామిని అత్తింటి వారి వేధింపులకు గురిచేస్తున్నారని తీవ్ర మనస్థాపం చెందిన తండ్రి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. కూతురి కాపురం సరిగా లేదనే మనస్తాపంతో శ్రీనివాసరావు సొంత గ్రామం నెల్లూరు కలిగిరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు శ్రీనివాసరావు రాసిన సూసైడ్ లెటర్ పలువురిని కంటితడి పెట్టేలా చేసింది. తన కుమార్తెను మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్‌లో రాశాడు. యామిని భర్త చంద్రశేఖర్‌కు రాజకీయ పలుకుబడి ఉండటంతో తమను చాలా ఇబ్బందులకు గురిచేశాడని.. అంతే కాకుండా తన మనవడు గీతీష్ నాయుడు (3)ను తన కూతురికి దూరంగా ఉంచుతున్నారని మనోవేదన చెందాడు. వారిని కఠినంగా శిక్షించాలంటూ శ్రీనివాస్ రావు సూసైడ్ నోట్ రాశాడు.
సచిన్‌లా కోహ్లీ.. ఏం కొట్టాడు భయ్యా..
గ్రామస్తుల ధర్నా...
శ్రీనివాస్ మృతి విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలిగిరి నుంచి విశాఖకు శ్రీనివాస్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. టి.నగరం పాలెంలో శ్రీనివాసరావు మృతదేహం ముందు బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే కూతురి కాపురం బాగోలేదని తండ్రి ఆత్మహత్య చేసుకున్న వార్త స్థానికంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి...
Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం
గుర్తుపెట్టుకోండి.. జనవరి 1 నుంచి మారేవి ఇవే..
Read Latest AP News And Telugu news